టీడీపీ పత్రిక కథనాన్ని ఖండించిన సురేంద్రబాబు

మూడు రోజుల క్రితం ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబును ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే టీడీపీ పత్రిక మాత్రం ఈ బదిలీ వెనుక వేరే ఉద్దేశం ఉందంటూ కథనాన్ని ప్రచురించింది. విద్యుత్‌ బస్సులకు సంబంధించిన టెండర్ల నేపథ్యంలోనే సురేంద్రబాబును తప్పించారంటూ ఒక కథనాన్ని రాసింది. ఈ కథనాన్ని సురేంద్రబాబు ఖండించారు. అసలు విద్యుత్ బస్సుల టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదని సురేంద్రబాబు వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫేమ్-2 పథకం కింద ఆర్టీసీ 350 బస్సులను కొనుగోలు […]

Advertisement
Update: 2019-09-28 20:28 GMT

మూడు రోజుల క్రితం ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబును ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే టీడీపీ పత్రిక మాత్రం ఈ బదిలీ వెనుక వేరే ఉద్దేశం ఉందంటూ కథనాన్ని ప్రచురించింది. విద్యుత్‌ బస్సులకు సంబంధించిన టెండర్ల నేపథ్యంలోనే సురేంద్రబాబును తప్పించారంటూ ఒక కథనాన్ని రాసింది. ఈ కథనాన్ని సురేంద్రబాబు ఖండించారు.

అసలు విద్యుత్ బస్సుల టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదని సురేంద్రబాబు వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫేమ్-2 పథకం కింద ఆర్టీసీ 350 బస్సులను కొనుగోలు చేస్తోందని వెల్లడించారు. ఈ వ్యవహారం ఇంకా ప్రీబిడ్ దశలోనే ఉందన్నారు. అలాంటప్పుడు కిలోమీటర్‌కు రూ. 60 రూపాయలు అద్దె అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.

తక్కువ ధరకు బిడ్ వేసిన వారికే టెండర్ దక్కుతుందని ఇందులో అవకతవకలకు ఆస్కారమే లేదన్నారు. తన బదిలీ సాధారణంగా జరిగిందే గానీ దాని వెనుక ఎలాంటి కారణాలు లేవని సురేంద్రబాబు వివరించారు.

Tags:    
Advertisement

Similar News