విరాటపర్వం నుంచి మరో వీడియో లీక్

సెట్స్ పైకి వచ్చిన మొదటి రోజు నుంచి విరాటపర్వం సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. సహజసిద్ధమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతుండడం ఈ సినిమాకు పెద్ద సమస్యగా మారింది. ప్రజల మధ్య షూట్ చేయడంతో ఎవరికి వారు వీడియోలు, ఫొటోలు తీసి నెట్ లో పెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న జగిత్యాల బస్టాండ్ లో సాయిపల్లవిపై ఓ సీన్ తీస్తే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు అలాంటిదే మరో వీడియో బయటకు వచ్చింది. విరాటపర్వం […]

Advertisement
Update: 2019-09-19 00:23 GMT

సెట్స్ పైకి వచ్చిన మొదటి రోజు నుంచి విరాటపర్వం సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. సహజసిద్ధమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతుండడం ఈ సినిమాకు పెద్ద సమస్యగా మారింది. ప్రజల మధ్య షూట్ చేయడంతో ఎవరికి వారు వీడియోలు, ఫొటోలు తీసి నెట్ లో పెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న జగిత్యాల బస్టాండ్ లో సాయిపల్లవిపై ఓ సీన్ తీస్తే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు అలాంటిదే మరో వీడియో బయటకు వచ్చింది.

విరాటపర్వం సినిమాకు సంబంధించి ఈసారి కూడా సాయిపల్లవిపై మరో సీన్ తీశారు. నల్గొండ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఈ షెడ్యూల్ నడుస్తోంది. అటవీ ప్రాంతానికి కాస్త దగ్గరగా తీస్తున్న ఈ సన్నివేశాల్ని కూడా కొంతమంది షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.

మేకప్ లేకుండా సాయిపల్లవి ఈ సినిమాలో నటిస్తోంది. అత్యంత సహజంగా కనిపిస్తోంది. ఓవైపు వీడియోలు ఇలా లీక్ అవుతున్నప్పటికీ యూనిట్ మాత్రం టెన్షన్ పడడం లేదు. వాటిని సినిమాకు ప్రచారంగా భావిస్తోంది. మరోవైపు హీరో రానా ఇంకా సెట్స్ పైకి రాకపోవడం మాత్రం యూనిట్ ను కలవరపెడుతోంది.

Tags:    
Advertisement

Similar News