కోడెల అంతిమ యాత్రలో వివాదం....

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంతిమయాత్ర నర్సారావుపేటలో మొదలైంది. ఆయన అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణలు ఉన్నారు. రాజాగారితోటలో ఉన్న కోడెల నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కోడెల అంతిమయాత్రకు భారీగా జనం హాజరయ్యారు. ఆయనను చూడడానికి టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అంతిమయాత్ర రూట్ మార్చారు. షెడ్యూల్ ప్రకారం అంతిమయాత్ర ప్రస్తుత నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి […]

Advertisement
Update: 2019-09-18 08:06 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంతిమయాత్ర నర్సారావుపేటలో మొదలైంది. ఆయన అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణలు ఉన్నారు. రాజాగారితోటలో ఉన్న కోడెల నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.

కోడెల అంతిమయాత్రకు భారీగా జనం హాజరయ్యారు. ఆయనను చూడడానికి టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కాగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అంతిమయాత్ర రూట్ మార్చారు. షెడ్యూల్ ప్రకారం అంతిమయాత్ర ప్రస్తుత నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిని దాటాల్సి ఉంది.

అయితే కోడెల మరణం తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో…. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని పోలీసులు ఎమ్మెల్యే ఇంటి నుంచి కాకుండా రూట్ మ్యాప్ మార్చారు.

దీంతో టీడీపీ కార్యకర్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ఆదేశాల మేరకే పోలీసులు ఇలా రూట్ మ్యాప్ మార్చారని టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై భైటాయించారు.

Tags:    
Advertisement

Similar News