కాపులకు ధైర్యం ఎక్కువే పవన్ గారూ " కాపు నేతలు

కాపులకు ధైర్యం లేదని, అందుకే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు కాపు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. “పవన్ గారూ మీరు మా సామాజికవర్గమే కదా. మీకు ధైర్యం లేదా. కాపులకు ధైర్యం ఎంత ఉందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు” అని మాజీ ఎమ్మెల్యే, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. కాపులనుద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు […]

Advertisement
Update: 2019-09-15 21:50 GMT

కాపులకు ధైర్యం లేదని, అందుకే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు కాపు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.

“పవన్ గారూ మీరు మా సామాజికవర్గమే కదా. మీకు ధైర్యం లేదా. కాపులకు ధైర్యం ఎంత ఉందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు” అని మాజీ ఎమ్మెల్యే, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.

కాపులనుద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయని ఆమంచి మండిపడ్డారు. ఇన్ని మాటలు చెబుతున్న పవన్ కల్యాణ్ కాపు ఉద్యమ సమయంలో ఎక్కడికి పోయారని, ఆ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ కు ఏ అంశంపైనా అవగాహన కాని, అనుభవం కాని లేదని, తన సినీ గ్లామర్ తో ఏదో చేయాలనుకుంటే ఇక్కడ కుదరదని ఆమంచి మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టుల్లో ఒకరని శాసనసభ్యుడు అంబటి రాంబాబు అన్నారు.

“పవన్ గారు.. మీ నిజరూపం బయటపడుతోంది. రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. మీరు కూడా తెలుగుదేశం నాయకుల్లా కళ్లకు గంతలు కట్టుకుని మాట్లాడుతున్నారు. మీరు పెయిడ్ ఆర్టిస్టుల జాబితాలో చేరిపోయారా” అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

మూడు నెలల జగన్ పాలనపై పవన్ కల్యాణ్ ఇచ్చిన నివేదిక చూస్తుంటే ఆ నివేదికను చంద్రబాబు నాయుడుతో కలిసి రాసినట్లుగా ఉందని అంబటి రాంబాబు అన్నారు.

మరో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…. జగన్ పాలనపై విమర్శలు చేసే నైతిక హక్కు పవన్ కల్యాణ్ కు లేదని అన్నారు. “పవన్ గారు… మీ గురించి ప్రజలకు తెలుసు. మీరు అడ్డదారిలో చంద్రబాబు నాయుడికి ఎలా సాయ పడుతున్నారో కూడా వారికి తెలుసు. అందుకే గత ఎన్నికల్లో మిమ్మల్ని కూడా ఓడించారు. అయినా మీలో మార్పు రావడం లేదు” అని అన్నారు.

గత మూడు నెలలుగా రాష్ట్ర్రంలో సుపరిపాలన దిశగా అడుగులు పడుతున్నాయని, దానిని గమనించని పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన స్ర్కిప్ట్ ను చదువుతున్నారని అన్నారు.

Tags:    
Advertisement

Similar News