హైదరాబాద్‌లో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడంటే..!

ఈ మార్గంలో మెట్రోరైలు ఎలైన్‌మెంట్‌, స్టేషన్ల స్థానాలను ఫైనల్ చేసేందుకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించారు ఎన్వీఎస్‌ రెడ్డి.

Advertisement
Update: 2024-04-28 08:00 GMT

హైదరాబాద్ జనానికి మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా 13 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో ఫేజ్-2లో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మార్గంలో నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా 13 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

13 కొత్త మెట్రో స్టేషన్లు ఇవే..

నాగోల్ మెట్రో స్టేషన్

నాగోల్‌ చౌరస్తా

అల్కాపురి చౌరస్తా

కామినేని హాస్పిటల్

ఎల్బీనగర్‌ చౌరస్తా

సాగర్‌ రింగ్‌రోడ్డు

మైత్రీనగర్‌

కర్మాన్‌ఘాట్‌

చంపాపేట్‌

ఓవైసీ హాస్పిటల్‌

DRDO

హఫీజ్‌ బాబానగర్‌

చాంద్రాయణగుట్ట

నాగోల్ మెట్రో స్టేషన్‌తో ప్రారంభమై.. నాగోల్‌ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని హాస్పిటల్, ఎల్బీనగర్‌ చౌరస్తా, సాగర్‌ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్‌, కర్మాన్‌ఘాట్‌, చంపాపేట్‌, ఒవైసీ హాస్పిటల్‌, DRDO, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో మెట్రోరైలు ఎలైన్‌మెంట్‌, స్టేషన్ల స్థానాలను ఫైనల్ చేసేందుకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించారు ఎన్వీఎస్‌ రెడ్డి. మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని ఆదేశించారు.

హైదరాబాద్‌లో మొదటిసారిగా..

నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వెళ్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్‌ కుడివైపు కామినేని హాస్పిటల్‌ స్టేషన్‌ వస్తుంది. ఆ తర్వాత ఎల్బీనగర్‌ జంక్షన్‌ స్టేషన్‌.. కూడలికి కుడివైపు వస్తుంది. ఇప్పుడున్న ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఇందులోనే వాకలేటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా సౌకర్యం ఇప్పటివరకు నగరంలో ఎక్కడా లేదని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News