'పలాస 1978' నుంచి.... 'ఓ సొగసరి'

‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ సినిమా తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరొక స్మాల్ బడ్జెట్ సినిమా ‘పలాస 1978’. రక్షిత్ మరియు నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి కొత్త దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1970లలో కుల కలహాల ఆధారంగా పలాస అనే గ్రామంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట అయిన […]

Advertisement
Update: 2019-08-29 00:08 GMT

‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ సినిమా తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరొక స్మాల్ బడ్జెట్ సినిమా ‘పలాస 1978’. రక్షిత్ మరియు నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి కొత్త దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

1970లలో కుల కలహాల ఆధారంగా పలాస అనే గ్రామంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట అయిన ‘ఓ సొగసరి’ లిరికల్ వీడియో ని విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

పాటకి తగ్గట్టు గానే 70 ల పాటకి మోడ్రన్ టచ్ ఇచ్చినట్టు రఘు కుంచె సంగీతం సినిమాకి చాలా బాగా సెట్ అయింది. పాట వింటున్నంతసేపు మనకి కూడా 1970 ల కాలంలో ఉన్న భావన కలుగుతుంది.

బాలసుబ్రహ్మణ్యం, బేబీ ల గొంతు ఈ పాటకి బాగా సెట్ అయింది. ముఖ్యంగా లక్ష్మీ భూపాలం రాసిన లిరిక్స్ సినిమాకి హై లైట్ కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ఈ పాటే సినిమాపై అంచనాలను పెంచుతోంది… తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమా ని సమర్పిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News