ఆర్కా మీడియా కాస్టింగ్ కాల్.... నిజం కాదట...

బాహుబలి సినిమా పెద్ద హిట్ అయినప్పట్నుంచి ఈ నిర్మాణ సంస్థపై రోజుకో పుకారు వినిపిస్తూనే ఉంది. తాజాగా కాస్టింగ్ కాల్ అంటూ మరో పుకారు వినిపించింది. ఆర్కా మీడియా పేరిట కాస్టింగ్ కాల్ వెలువడింది. బాహుబలి రేంజ్ లో ఈ నిర్మాతలు మరో సినిమా తీయబోతున్నారని, ఇందులో నటించడానికి నటీనటులు కావాలనేది ఆ ప్రకటన సారాంశం. ఇదొక దొంగ ప్రకటన. డబ్బులు దోచే రకం. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్కా మీడియా రియాక్ట్ అయింది. ఆ […]

Advertisement
Update: 2019-08-27 23:08 GMT

బాహుబలి సినిమా పెద్ద హిట్ అయినప్పట్నుంచి ఈ నిర్మాణ సంస్థపై రోజుకో పుకారు వినిపిస్తూనే ఉంది. తాజాగా కాస్టింగ్ కాల్ అంటూ మరో పుకారు వినిపించింది. ఆర్కా మీడియా పేరిట కాస్టింగ్ కాల్ వెలువడింది. బాహుబలి రేంజ్ లో ఈ నిర్మాతలు మరో సినిమా తీయబోతున్నారని, ఇందులో నటించడానికి నటీనటులు కావాలనేది ఆ ప్రకటన సారాంశం. ఇదొక దొంగ ప్రకటన. డబ్బులు దోచే రకం.

ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్కా మీడియా రియాక్ట్ అయింది. ఆ ప్రకటనకు తమ నిర్మాణ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, అంతా అప్రమత్తగా ఉండాలని ప్రకటించింది. ఎవరైనా సదరు ప్రకటన నమ్మి డబ్బులు పోగొట్టుకుంటే తమకు సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించింది ఈ నిర్మాణ సంస్థ.

నిజానికి ఇలాంటి ఫేక్ కాస్టింగ్ కాల్ ప్రకటనలు చాలా కామన్. ప్రముఖ నిర్మాణ సంస్థల పేర్లు చెప్పి ఇలాంటివి చాలా పుట్టుకొస్తుంటాయి. కొంతమంది వీటిపై రియాక్ట్ అవుతారు, మరికొంతమంది లైట్ తీసుకుంటారు. కానీ ఆర్కా మీడియా మాత్రం పనిగట్టుకొని మరీ స్పందించడానికి ఓ కారణం ఉంది. గతంలో ఇదే బ్యానర్ పేరిట ఓ నకిలీ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ద్వారా లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు కొంతమంది వ్యక్తులు. చివరికి ఈ విషయం నిర్మాణ సంస్థ వరకు కూడా వచ్చింది. ఈసారి కూడా అలాంటిదే మరో నకిలీ ప్రకటన రావడంతో సదరు నిర్మాణ సంస్థ అప్రమత్తమైంది.

Tags:    
Advertisement

Similar News