అధిక సంతాన నిరోధానికి చట్టం

దేశంలో జనాభా నియంత్రణకు కేంద్రం కఠిన చర్యలు తీసుకోబోతోంది. ఆగస్ట్‌ 15న ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ జనాభా విస్పోటనాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. తన ప్రసంగంలో చెప్పినట్టుగానే జనాభా నియంత్రణకు మోడీ సర్కార్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో మోడీ చర్చలు జరిపినట్టు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ నియంత్రణ ప్రతి ఒక్కరూ పాటించేలా చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కుటుంబ నియంత్రణ పాటించే […]

Advertisement
Update: 2019-08-19 20:30 GMT

దేశంలో జనాభా నియంత్రణకు కేంద్రం కఠిన చర్యలు తీసుకోబోతోంది. ఆగస్ట్‌ 15న ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ జనాభా విస్పోటనాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. తన ప్రసంగంలో చెప్పినట్టుగానే జనాభా నియంత్రణకు మోడీ సర్కార్‌ కసరత్తు మొదలుపెట్టింది.

ఈ దిశగా ఇప్పటికే అధికారులతో మోడీ చర్చలు జరిపినట్టు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ నియంత్రణ ప్రతి ఒక్కరూ పాటించేలా చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కుటుంబ నియంత్రణ పాటించే వారికి ప్రోత్సాహకాలు, కుటుంబ నియంత్రణ పాటించని వారికి పథకాల్లో కోతలు పెట్టే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.

గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఈ అంశంపై కమిటీ వేశారు. అయితే జనాభా నియంత్రణ చట్టం కోసం అప్పట్లో కమిటి ఇచ్చిన నివేదికను వాజ్‌పేయి ప్రభుత్వం పక్కన పెట్టింది. మోడీ సర్కార్ మాత్రం ఈ అంశంలో సీరియస్‌గా ఉంది. భారత్‌లో జనాభా ఇక ఏమాత్రం పెరగడానికి వీల్లేదన్న ఆలోచనతో కేంద్రం ఉన్నట్టు చెబుతున్నారు. 2025 నాటికి 145 కోట్ల జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News