పోలీస్ ఐజీకి సామాన్యుని బహుమతి

సీనియర్ ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ అధికారి ఒకరికి మనసును హద్దుకునే గిఫ్ట్ అందింది. అతడు తనని ప్రశంసిస్తూ రాసిన ఓ లెటర్ ని, రూ.500 చెక్ ని గురువారం అందుకున్నాడు. ఆ ఉత్తరాన్ని చదువుకున్న ఆయన పరమానంద భరితుడయ్యాడు. తన జీవితంలో ఇంతకన్నా పెద్ద బహుమతి ఎప్పుడూ అందుకోలేదని ఆయన అన్నారు. ఇంతకు ఏంజరిగిందంటే… 1996 ఐపీఎస్ ఆఫీసర్ ఏ.సతీష్ గణేష్ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆగ్రా రేంజ్ లో పనిచేస్తున్నారు. ఆయన […]

Advertisement
Update: 2019-08-10 20:55 GMT

సీనియర్ ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ అధికారి ఒకరికి మనసును హద్దుకునే గిఫ్ట్ అందింది. అతడు తనని ప్రశంసిస్తూ రాసిన ఓ లెటర్ ని, రూ.500 చెక్ ని గురువారం అందుకున్నాడు. ఆ ఉత్తరాన్ని చదువుకున్న ఆయన పరమానంద భరితుడయ్యాడు. తన జీవితంలో ఇంతకన్నా పెద్ద బహుమతి ఎప్పుడూ అందుకోలేదని ఆయన అన్నారు.

ఇంతకు ఏంజరిగిందంటే…

1996 ఐపీఎస్ ఆఫీసర్ ఏ.సతీష్ గణేష్ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆగ్రా రేంజ్ లో పనిచేస్తున్నారు. ఆయన పని తీరు ని మెచ్చుకుంటూ ‘ఇటా’ కి చెందిన విజయ్ పాల్ సింగ్ అనే సామాన్య పౌరుడు ఈ ఉత్తరం, చెక్ పంపించాడు. విజయ్ పాల్ సింగ్… ఈ పోలీస్ ఆఫీసర్ చేసిన ఒక పనిని ఈ సందర్భం గా గుర్తు చేశాడు.

ఒకసారి పోలీసుల పని తీరుని పరీక్షించేందుకు మధుర హైవే పోలీస్ స్టేషన్ కి ఒక మిలిటరీ కల్నల్ వేషం లో వెళ్లి లాప్ టాప్ పోయిందని తాను ఫిర్యాదు చేసిన సంగతిని సింగ్ గుర్తు చేశాడని… సామాన్యులు ఎవరు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయరని చెబుతూ… తన పని శైలికి మెచ్చి ఈ కామన్ మాన్ అభినందనలు తెలియచేశాడని గణేష్ తబ్బిబ్బవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News