నవయుగకు మరో భారీ షాక్‌

ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగకు మరో షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ నుంచి నవయుగను ప్రభుత్వం తప్పించింది. కాంట్రాక్టును రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టు నిర్మాణం కోసం 2010 జూన్‌లో నవయుగ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పటి వరకు పోర్టు నిర్మాణం దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నవయుగ సంస్థ ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును నిర్వహిస్తోంది. బందరు […]

Advertisement
Update: 2019-08-08 22:26 GMT

ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగకు మరో షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ నుంచి నవయుగను ప్రభుత్వం తప్పించింది. కాంట్రాక్టును రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

పోర్టు నిర్మాణం కోసం 2010 జూన్‌లో నవయుగ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పటి వరకు పోర్టు నిర్మాణం దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

నవయుగ సంస్థ ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును నిర్వహిస్తోంది. బందరు పోర్టు వస్తే కృష్ణపట్నం పోర్టు ద్వారా లాభాలు తగ్గుతాయన్న ఉద్దేశంతోనే నవయుగ సంస్థ బందరు పోర్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తోందని ఏపీ ప్రభుత్వం భావించింది. అందుకే కాంట్రాక్టు రద్దు చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బందరుపోర్టు నిర్మాణం కోసం నవయుగకు కేటాయించిన 412 ఎకరాల భూమిని కూడా ఏపీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది.

Tags:    
Advertisement

Similar News