వెంకయ్యనాయుడు అంతగా హెచ్చరించారా?

ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని జగన్‌మోహన్ రెడ్డి తొలిసారిగా ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకయ్యనాయుడితో జగన్‌ భేటీపై టీడీపీ అనుకూల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుల వల్ల ఆపార్టీ ఓడిపోయిందని… ఇప్పుడు మీరు కూడా అదే తప్పులు చేస్తున్నారని వెంకయ్యనాయుడు జగన్‌ వద్ద వ్యాఖ్యానించారని సదరు పత్రిక ప్రచురించింది. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారని వెంకయ్యనాయుడు అభిప్రాయపడినట్టు తెలుస్తోందని వెల్లడించింది. పరోక్షంగా ప్రాజెక్టుల్లో అక్రమాల నేపథ్యంలో […]

Advertisement
Update: 2019-08-08 01:23 GMT

ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని జగన్‌మోహన్ రెడ్డి తొలిసారిగా ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకయ్యనాయుడితో జగన్‌ భేటీపై టీడీపీ అనుకూల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుల వల్ల ఆపార్టీ ఓడిపోయిందని… ఇప్పుడు మీరు కూడా అదే తప్పులు చేస్తున్నారని వెంకయ్యనాయుడు జగన్‌ వద్ద వ్యాఖ్యానించారని సదరు పత్రిక ప్రచురించింది. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారని వెంకయ్యనాయుడు అభిప్రాయపడినట్టు తెలుస్తోందని వెల్లడించింది.

పరోక్షంగా ప్రాజెక్టుల్లో అక్రమాల నేపథ్యంలో రివర్స్ టెండర్లు పిలవడం, రాష్ట్రానికి భారంగా మారిన విద్యుత్ ఒప్పందాలను సమీక్షించడం వంటి వాటిని వెంకయ్యనాయుడు కూడా వ్యతిరేకిస్తున్న భావన కలిగేలా పత్రిక కథనం ఉంది.

అయితే వెంకయ్యనాయుడు ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న అంశం మిగిలిన పత్రికల్లో ఎక్కడా రాలేదు. కేవలం ఆ ఒక్క పత్రికలో మాత్రమే వచ్చింది.

అయితే ఈ కథనం అంతా మీడియా సృష్టి అని…. నిజానికి జగన్‌ను తన దగ్గరకు వచ్చేలా చేసుకోవడానికి వెంకయ్యనాయుడు చాలా కష్టపడ్డాడని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా మన తెలుగువాడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవలేదు. దాంతో ఇతరుల ముందు ఆయనకు చాలా అవమానంగా తోచింది.

అయితే వెళ్ళి వెంకయ్య నాయుడిని కలిసినా, కలవకపోయినా పెద్ద తేడా లేదని, ఆయన ఎప్పుడూ ఒక వర్గానికి తప్ప ఇతరులకు సాయం చేయడన్న గట్టి నమ్మకంతోనే జగన్‌ ఆయనను కలవలేదని…. వైసీపీ నాయకులు అంటున్నారు. మరి ఇప్పుడు ఏం జరిగిందో…. ఎవరి బలవంతం మీద జగన్‌ వెంకయ్యనాయుడిని కలిసాడో తెలియదు.

Tags:    
Advertisement

Similar News