భారత్‌ ఆక్రమించిన దేశంగా కశ్మీర్‌ నిలిచిపోతుంది " ముఫ్తీ

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై కశ్మీర్ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కశ్మీర్‌ ప్రజలకు ఇచ్చిన మాటను భారత ప్రభుత్వం తప్పిందని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. People like us who placed faith in Parliament, the temple of democracy have been deceived. Those elements in J&K who rejected the ?? constitution & sought resolution under the UN have […]

Advertisement
Update: 2019-08-05 01:22 GMT

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై కశ్మీర్ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
కశ్మీర్‌ ప్రజలకు ఇచ్చిన మాటను భారత ప్రభుత్వం తప్పిందని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.

భారత ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజని వ్యాఖ్యానించారామె. ఆర్టికల్ 370 రద్దు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్య వల్ల చరిత్రలో కశ్మీర్‌…. భారత్‌ బలవంతంగా ఆక్రమించిన దేశంగా మిగిలిపోతుందని ఆమె విమర్శించారు. ప్రజలను భయపెట్టి కశ్మీర్‌ను లాక్కుంటున్నారని ముఫ్తీ వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ విమర్శించారు. స్వయం ప్రతిపత్తి కోసం కశ్మీర్ ప్రజలు ఎన్నో బలిదానాలు చేశారన్నారు. ఇకపై కశ్మీర్‌ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ హత్య చేసిందని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై కేంద్ర వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

Tags:    
Advertisement

Similar News