విజయ్.... సేవ్ వాటర్....

డియర్ కామ్రేడ్ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ తో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా మొదటి రోజునుంచే భారీ కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది. అయితే డియర్ కామ్రేడ్ సినిమా జరుగుతున్న సమయం లో నే విజయ్ దేవరకొండ కి ఒక రోజు తన ఇంట్లో నీటి సమస్య ఎదురైందట. అందుకే ఆ సామాజిక స్పృహ తో నే సినిమా లో ఒక ముఖ్యమైన సీన్ లో షవర్ ని వాడకుండా నీటిని […]

Advertisement
Update: 2019-07-29 00:04 GMT

డియర్ కామ్రేడ్ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ తో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా మొదటి రోజునుంచే భారీ కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది.

అయితే డియర్ కామ్రేడ్ సినిమా జరుగుతున్న సమయం లో నే విజయ్ దేవరకొండ కి ఒక రోజు తన ఇంట్లో నీటి సమస్య ఎదురైందట. అందుకే ఆ సామాజిక స్పృహ తో నే సినిమా లో ఒక ముఖ్యమైన సీన్ లో షవర్ ని వాడకుండా నీటిని చెంబు తో వాడి ఒక సైలెంట్ మెసేజ్ ఇచ్చాడు విజయ్.

ఇదే విషయాన్ని చాలా చోట్ల ప్రమోషన్స్ లో ఉదహరిస్తూ త్వరలోనే తాను నీటి ని పరిరక్షించుకునేందుకు ఒక ప్రణాళిక తో వస్తాను అని తెలిపాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ఇంకా ప్రణాళిక ని సిద్ధం చేయలేదని, కానీ నీటి సమస్య చాలా లోతైనదని.. సేవ్ వాటర్ అంటూ చెప్పుకొచ్చాడు.

కొంత మందితో కలిసి త్వరలో నే హైదరాబాద్ లో నీటి పరిరక్షణకై విజయ్ దేవరకొండ తన వంతు గా దీనిపై ఒక ఈవెంట్ ని చేయదలిచాడట. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలని విజయ్ త్వరలో నే అందరికీ తెలియజేయనున్నాడట. అయితే విజయ్ ప్రకటనకై ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News