పార్లమెంట్‌లో ట్రంప్ వ్యాఖ్యల దుమారం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో దుమారం రేగింది. వాషింగ్టన్ డీసీలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ట్రంప్‌… రెండు వారాల క్రితం భారత ప్రధాని మోడీ తనతో మాట్లాడారని చెప్పారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా తనను మోడీ విజ్ఞప్తి చేశారని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపైనే పార్లమెంట్‌లో దుమారం రేగింది. కశ్మీర్ విషయంలో ట్రంప్‌తో మోడీ ఏం మాట్లాడారో స్పష్టత ఇవ్వాలంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు డిమాండ్ […]

Advertisement
Update: 2019-07-23 00:49 GMT

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో దుమారం రేగింది. వాషింగ్టన్ డీసీలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ట్రంప్‌… రెండు వారాల క్రితం భారత ప్రధాని మోడీ తనతో మాట్లాడారని చెప్పారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా తనను మోడీ విజ్ఞప్తి చేశారని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపైనే పార్లమెంట్‌లో దుమారం రేగింది.

కశ్మీర్ విషయంలో ట్రంప్‌తో మోడీ ఏం మాట్లాడారో స్పష్టత ఇవ్వాలంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు డిమాండ్ చేశాయి. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిందిగా ట్రంప్‌ను ఎలా అడుగుతారని మోడీని విపక్షాలు నిలదీశాయి. ట్రంప్ వ్యాఖ్యలపైనే పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి.

ట్రంప్ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా తాము … ట్రంప్‌ను కోరలేదని కేంద్రం వెల్లడించింది. కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌ ప్రకటన పూర్తి అవాస్తవమని ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News