భారీ మెజారిటీతో నెగ్గిన రోజా భర్త

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణి తమిళ దర్శకుల సంఘం ఎన్నికల్లో సత్తా చాటారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఇటీవల భారతీరాజాను తొలుత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఎన్నిక ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిందేనంటూ దర్శకుడు జననాథన్‌ పట్టుపట్టారు. దాంతో భారతీరాజా రాజీనామా చేశారు. ఎన్నిక అన్నివార్యం అయింది. పోటీలో దర్శకుడు ఎస్‌.పీ.జననాథన్, అమీర్‌ల నామినేషన్లను తిరష్కరించడంతో పోరు ఆర్కే సెల్వమణి, విద్యాసాగర్‌ మధ్య జరిగింది. ఆదివారం పోలింగ్ నిర్వహించి సాయంత్రం […]

Advertisement
Update: 2019-07-21 22:11 GMT

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణి తమిళ దర్శకుల సంఘం ఎన్నికల్లో సత్తా చాటారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఇటీవల భారతీరాజాను తొలుత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అయితే ఎన్నిక ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిందేనంటూ దర్శకుడు జననాథన్‌ పట్టుపట్టారు. దాంతో భారతీరాజా రాజీనామా చేశారు. ఎన్నిక అన్నివార్యం అయింది.

పోటీలో దర్శకుడు ఎస్‌.పీ.జననాథన్, అమీర్‌ల నామినేషన్లను తిరష్కరించడంతో పోరు ఆర్కే సెల్వమణి, విద్యాసాగర్‌ మధ్య జరిగింది. ఆదివారం పోలింగ్ నిర్వహించి సాయంత్రం నుంచి కౌంటింగ్ నిర్వహించారు.

మొత్తం 1900 ఓట్లకు గాను… 1503 ఓట్లు పోలయ్యాయి. దర్శకుడు ఆర్‌కే సెల్వమణికి ఏకంగా 1386 ఓట్లు రాగా… ఆయన ప్రత్యర్థి విద్యాసాగర్‌కు కేవలం 100 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Tags:    
Advertisement

Similar News