ప్రపంచకప్ లీగ్ లో భారత్ ఆఖరాట

హెడింగ్లే వేదికగా శ్రీలంకతో పోటీ  100వ వికెట్ కు జస్ ప్రీత్ బుమ్రా తహతహ కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ కు మలింగ 2019 వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆఖరి రౌండ్ మ్యాచ్ లకు రంగం సిద్ధమయ్యింది. 10 జట్ల లీగ్ ఆఖరి మ్యాచ్ ల్లో భారత్ తో శ్రీలంక, సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనున్నాయి. లీడ్స్ లోని హెడింగ్లే గ్రౌండ్స్ వేదికగా జరిగే 9వ రౌండ్ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ […]

Advertisement
Update: 2019-07-06 03:33 GMT
  • హెడింగ్లే వేదికగా శ్రీలంకతో పోటీ
  • 100వ వికెట్ కు జస్ ప్రీత్ బుమ్రా తహతహ
  • కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ కు మలింగ

2019 వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆఖరి రౌండ్ మ్యాచ్ లకు రంగం సిద్ధమయ్యింది. 10 జట్ల లీగ్ ఆఖరి మ్యాచ్ ల్లో భారత్ తో శ్రీలంక, సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

లీడ్స్ లోని హెడింగ్లే గ్రౌండ్స్ వేదికగా జరిగే 9వ రౌండ్ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

7వ విజయానికి భారత్ రెడీ….

రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా వర్షంతో రద్దయిన న్యూజిలాండ్ మ్యాచ్ వరకూ…ఎనిమిదిరౌండ్లు ఆడిన భారత్ 6 విజయాలు, ఓ పరాజయం రికార్డుతో ఉంది.

మొత్తం 13 పాయింట్లతో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్న భారత్ ఎలాంటి ఒత్తిడిలేకుండా ఆఖరిరౌండ్ మ్యాచ్ కు సిద్ధమయ్యింది. మాజీ చాంపియన్ శ్రీలంకను సైతం చిత్తు చేయడం ద్వారా..రౌండ్ రాబిన్ లీగ్ పోటీలను విజయంతో ముగించాలన్న పట్టుదలతో విరాట్ సేన ఉంది.

మలింగకు ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్…

శ్రీలంక వెటరన్ ఫాస్ట్ బౌలర్, యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ తన కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ కు సిద్ధమయ్యాడు. పవర్ ఫుల్ భారత్ కు సవాలు విసరడం ద్వారా తన కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ లో పూర్తిస్థాయిలో రాణించాలవ్న పట్టుదలతో ఉన్నాడు.

మరోవైపు…భారత యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా మాత్రం…తన వన్డే కెరియర్ లో 100వ వికెట్ కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీలంకతో మ్యాచ్ ద్వారా వికెట్ల సెంచరీ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

హెడింగ్లేలో పరుగులే పరుగులు…

మ్యాచ్ వేదిక హెడింగ్లే వికెట్ బ్యాటింగ్ కు అనువుగా ఉంటుందని, స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తుందని పిచ్ క్యూరేటర్ అంటున్నారు. ఇప్పటికే సెమీస్ రేస్ కు దూరమైన శ్రీలంక మాత్రం…ఆఖరిరౌండ్ ను విజయంతో ముగించడం ద్వారా స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తోంది.

ఇప్పటికే నాలుగు సెంచరీలతో పాటు 500కు పైగా పరుగులు సాధించిన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…రికార్డు స్థాయిలో ఐదో ప్రపంచకప్ శతకం బాదాలన్న పట్టుదలతో ఉన్నాడు.

జడేజా వైపు టీమ్ మేనేజ్ మెంట్ చూపు…

నిలకడలేని మిడిలార్డర్ తో సతమతమవుతున్న భారత్…ఈ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్ లో నెగ్గినా…ఓడినా లీగ్ టేబుల్ రెండోస్థానంలో భారత్ నిలవడం ఖాయం కావడంతో…సెమీఫైనల్స్ కు సన్నాహక మ్యాచ్ గా… విరాట్ సేన ఉపయోగించుకోనుంది.

Tags:    
Advertisement

Similar News