ఆయన సలహాతో... చంద్రబాబుకు దిమ్మతిరిగింది...

పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా విజయవాడ, కాకినాడలలో సమావేశం అయిన కాపు నేతలను చంద్రబాబు తన చాణక్యంతో తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఓటమికి కారణాలను కాపు నేతలతో కలిసి విశ్లేషిస్తూ… మొత్తం తప్పును ఓటర్ల మీదకే తోసేశాడు. అయితే కాపు నేతలు మాత్రం తమ ఓటమికి చాలా వరకూ బాధ్యత పార్టీదేనని…. ముఖ్యంగా లోకేష్ దే నని నిర్మొహమాటంగా చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీ నుంచి ఒక సామాజిక వర్గానికి పెద్ద మొత్తంలో ఫండ్‌ వెళ్ళిందని…. కానీ కాపు […]

Advertisement
Update: 2019-07-05 03:21 GMT

పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా విజయవాడ, కాకినాడలలో సమావేశం అయిన కాపు నేతలను చంద్రబాబు తన చాణక్యంతో తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఓటమికి కారణాలను కాపు నేతలతో కలిసి విశ్లేషిస్తూ… మొత్తం తప్పును ఓటర్ల మీదకే తోసేశాడు.

అయితే కాపు నేతలు మాత్రం తమ ఓటమికి చాలా వరకూ బాధ్యత పార్టీదేనని…. ముఖ్యంగా లోకేష్ దే నని నిర్మొహమాటంగా చెప్పారు.

ఎన్నికల సమయంలో పార్టీ నుంచి ఒక సామాజిక వర్గానికి పెద్ద మొత్తంలో ఫండ్‌ వెళ్ళిందని…. కానీ కాపు నేతలకు మాత్రం తక్కువ ఫండ్‌ పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల కూడా టీడీపీ బాగా నష్టపోయిందని కాపు నేతలు చెప్పారు.

ముద్రగడ పద్మనాభంతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల కూడా కాపులు చాలామంది టీడీపీకి దూరమయ్యారన్నారు. ముఖ్యంగా లోకేష్‌ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదని…. ఆయన ప్రవర్తన కాపుల్ని చాలా బాధించిందని కొందరు కాపునేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

చివరగా…. సమావేశంలో పాల్గొన్న అందరికీ దిమ్మతిరిగిపోయేలా జ్యోతుల నెహ్రూ ఒక సలహా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను చెబుతూ…. వైసీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడం కూడా ఒక కారణం అని జ్యోతుల నెహ్రూ అన్నారు. దీంతో అందరూ షాక్‌ తిన్నారు. ఎందుకంటే…. ఆయన కూడా వైసీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశంలోకి వచ్చినవారే కావడం…!

Tags:    
Advertisement

Similar News