బైక్‌పై వెనుక కూర్చున్న వారికీ హెల్మెట్ తప్పనిసరి...

హెల్మెట్ వాడకంపై మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తమిళనాడులో బైక్‌ను నడిపే వారే కాకుండా… బైక్‌పై వెనుక కూర్చున్నవారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోయినా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. నాలుగు చక్రాల వాహనంలో ప్రయాణించే వారంతా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించేలా చూడాలని ఆదేశించింది. పోలీసులే హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం పైనా హైకోర్టు సీరియస్‌ అయింది. ఇకపై ప్రతి ఒక్కరూ హెల్మెట్ […]

Advertisement
Update: 2019-06-28 23:00 GMT

హెల్మెట్ వాడకంపై మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తమిళనాడులో బైక్‌ను నడిపే వారే కాకుండా… బైక్‌పై వెనుక కూర్చున్నవారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోయినా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది.

నాలుగు చక్రాల వాహనంలో ప్రయాణించే వారంతా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించేలా చూడాలని ఆదేశించింది. పోలీసులే హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం పైనా హైకోర్టు సీరియస్‌ అయింది.

ఇకపై ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని… ఒకవేళ పోలీసులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది హైకోర్టు.

Tags:    
Advertisement

Similar News