పవన్ సినిమాల్లోకి వస్తున్నాడు... కానీ....

మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోవడమే కాకుండా…. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోవడం సంచలనం సృష్టించింది. ఎన్నికల్లో ఓడిపోయినా తాను పూర్తిస్థాయిగా రాజకీయాల్లోనే ఉంటాను… సినిమాల్లోకి వెళ్లను అని క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.  ఆయన అజ్ఞాతవాసి తర్వాత వేరే ఏ సినిమా లో కూడా కనిపించలేదు. అయితే తాజా గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తున్నాడట… కానీ పూర్తిస్థాయిలో […]

Advertisement
Update: 2019-06-21 01:06 GMT

మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోవడమే కాకుండా…. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోవడం సంచలనం సృష్టించింది. ఎన్నికల్లో ఓడిపోయినా తాను పూర్తిస్థాయిగా రాజకీయాల్లోనే ఉంటాను… సినిమాల్లోకి వెళ్లను అని క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన అజ్ఞాతవాసి తర్వాత వేరే ఏ సినిమా లో కూడా కనిపించలేదు.

అయితే తాజా గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తున్నాడట… కానీ పూర్తిస్థాయిలో నిర్మాత గా మారబోతున్నాడట. ఈ విషయం ఎప్పటి నుంచో మీడియా లో వినిపిస్తున్నా దీని పై ఒక క్లారిటీ మాత్రం ఇప్పటి వరకు లేదు.

అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల మేరకు పవన్ కళ్యాణ్ నిర్మాత గా మారి రామ్ చరణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నారట. ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమా ని ప్రారంభం చేసి ఆరు నెలల్లో విడుదల చేయాలనే ప్లాన్ లో పవన్ ఉన్నారట.

అయితే దీని పై అధికారిక ప్రకటన రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News