ఢిల్లీలో జగన్‌ని చూడటానికి ఎగబడిన అభిమానులు...!.... ప్రధానితో భేటి

వైఎస్ జగన్ తన తొమ్మిదేండ్ల కష్టం తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ నెల 30న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకు మునుపే ముఖ్య నాయకులను ఆయన కలుసుకుంటున్నారు. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలసిన ఆయన ఇవాళ ప్రధాని మోడీని కలవడానికి ఢిల్లీ వచ్చారు. ఉదయం 10 గంటలకు ఆయన ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడ వైఎస్ జగన్‌ను చూసేందుకు, అతనికి షేక్‌హ్యండ్ ఇచ్చేందుకు అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు. ఒకానొక దశలో మీడియా, పోలీసులు, అభిమానుల […]

Advertisement
Update: 2019-05-26 00:59 GMT

వైఎస్ జగన్ తన తొమ్మిదేండ్ల కష్టం తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ నెల 30న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకు మునుపే ముఖ్య నాయకులను ఆయన కలుసుకుంటున్నారు. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలసిన ఆయన ఇవాళ ప్రధాని మోడీని కలవడానికి ఢిల్లీ వచ్చారు.

ఉదయం 10 గంటలకు ఆయన ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడ వైఎస్ జగన్‌ను చూసేందుకు, అతనికి షేక్‌హ్యండ్ ఇచ్చేందుకు అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు. ఒకానొక దశలో మీడియా, పోలీసులు, అభిమానుల మధ్య జగన్ చిక్కుకున్నారు. ప్లీజ్.. మీద పడొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తూనే అందరితో కరచాలనం చేశారు.

ఇక అక్కడి నుంచి జగన్ నేరుగా కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు. జగన్ వెంట ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్ర సమస్యలు, నిధుల విడుదల, ప్రత్యేక హోదాకు సంబంధించి మోడీకి జగన్ తన బాణీని వినిపించనున్నారు. మోడీ జగన్‌తో భేటీకి ఒక గంట సమయం కేటాయించడం విశేషం. అలాగే 30న తన ప్రమాణ స్వీకారానికి కూడా రావాలని జగన్‌ కోరనున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News