ఈవీఎంలను విమర్శించేవాళ్ళపై ప్రణబ్‌ ముఖర్జీ చెణుకులు

కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియ పై ప్రణబ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని ఈసీకి కితాబిచ్చారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించవద్దని ప్రణబ్‌ హితవు పలికారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ఎన్నికల నిర్వహణ సంస్థలని, ఎన్నికల సంస్థలన్నీ బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవపడతాడని…. మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగించుకుంటాడని…. ఈసీపై, ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న నేతలకు చురకలంటించారు ప్రణబ్‌. ఈసీపై పదేపదే ఆరోపణలు […]

Advertisement
Update: 2019-05-21 01:29 GMT

కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియ పై ప్రణబ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని ఈసీకి కితాబిచ్చారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించవద్దని ప్రణబ్‌ హితవు పలికారు.

ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ఎన్నికల నిర్వహణ సంస్థలని, ఎన్నికల సంస్థలన్నీ బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు.

చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవపడతాడని…. మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగించుకుంటాడని…. ఈసీపై, ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న నేతలకు చురకలంటించారు ప్రణబ్‌.

ఈసీపై పదేపదే ఆరోపణలు చేస్తూ దుష్ప్ర్రచారానికి దిగుతున్న చంద్రబాబుకు… ప్రణబ్‌ వ్యాఖ్యలు చెంపపెట్టులాంటివని అంటున్నారు ప్రతిపక్షనాయకులు.

తొలి ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ నుంచి నేటి వరకూ ఎన్నికల సంఘం చక్కగా ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు ప్రణబ్‌. ఎన్నికల కమిషనర్లందరినీ ప్రభుత్వాలే నియమిస్తూ వచ్చాయని గుర్తుచేశారు ఆయన‌.

సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 67 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. చాలా సంవత్సరాల తర్వాత తాను ఓటు వేశానని…. దేశంలో 2/3 శాతం మంది ఓటర్లు ఓటింగ్‌ ప్రక్రియలో భాగస్వాములయ్యారన్నారు ప్రణబ్‌.

Tags:    
Advertisement

Similar News