ఓటు వేయని పొలిటికల్ హీరోయిన్.. సెటైర్లు!

మాజీ ఎంపీ అయిన నటి రమ్య తన ఓటు హక్కును వినియోగించు కొకపోవడం తో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎంపీగా వ్యవహరించింది రమ్య. మండ్య నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు గతంలో. అయితే అనంతరం మళ్లీ ఎన్నికల్లో నెగ్గలేకపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె క్రియాశీల రాజకీయ నేతగా ఉంటూ వచ్చారు. వివిధ అంశాల గురించి స్పందించడం, ప్రత్యేకించి ప్రధాని మోడీని టార్గెట్ చేసుకోవడంలో రమ్య చాలా […]

Advertisement
Update: 2019-04-21 01:14 GMT

మాజీ ఎంపీ అయిన నటి రమ్య తన ఓటు హక్కును వినియోగించు కొకపోవడం తో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎంపీగా వ్యవహరించింది రమ్య. మండ్య నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు గతంలో. అయితే అనంతరం మళ్లీ ఎన్నికల్లో నెగ్గలేకపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె క్రియాశీల రాజకీయ నేతగా ఉంటూ వచ్చారు.

వివిధ అంశాల గురించి స్పందించడం, ప్రత్యేకించి ప్రధాని మోడీని టార్గెట్ చేసుకోవడంలో రమ్య చాలా ఉత్సాహాన్ని చూపించేది. మోడీ మీద అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడేది. ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి అధిపతి కూడా పని చేశారామె.

ఏతావాతా కాంగ్రెస్ పార్టీ తరఫు సూపర్ యాక్టివ్ పొలిటీషియన్ గా వ్యవహరించింది రమ్య. అనేక సందర్భాల్లో ఈమె అలా రాజకీయ వార్తల్లో నిలిచింది కూడా. మరి అంతలా రాజకీయంగా స్పందించేసి, రాజకీయ నేతగా చలామణి అయ్యి, రాహుల్ గాంధీకి కూడా సన్నిహిత నేతగా పేరు తెచ్చుకుని.. తీరా ఆమె ఓటు హక్కు వినియోగించుకోకపోవడం ఆమె హేటర్స్ కు అవకాశంగా మారింది.

‘అన్ని మాటలు చెబుతావు..ఓటు మాత్రం వేయలేదా..’ అంటూ ఆమెను వారు ట్రోల్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి అలా ఇరుక్కుంది రమ్య!

Tags:    
Advertisement

Similar News