రెండో దశలోనూ కమలానికి కష్టమే...!

దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ పూర్తయింది. 13 రాష్ట్రాలలో 95 నియోజకవర్గాలలో రెండో దశ ఎన్నికలను పూర్తి చేసింది ఎన్నికల కమిషన్. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం తప్ప మిగిలిన 38 నియోజక వర్గాలలోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మిగిలిన రాష్ట్రాలలో కూడా చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కు కాని, సర్వేలకు గానీ ఎన్నికల కమిషన్ అంగీకరించకపోవడంతో ఫలితాలపై కచ్చితమైన సమాచారం రావటం లేదు గాని రెండో దశ పోలింగ్ […]

Advertisement
Update: 2019-04-18 21:52 GMT

దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ పూర్తయింది. 13 రాష్ట్రాలలో 95 నియోజకవర్గాలలో రెండో దశ ఎన్నికలను పూర్తి చేసింది ఎన్నికల కమిషన్. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం తప్ప మిగిలిన 38 నియోజక వర్గాలలోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మిగిలిన రాష్ట్రాలలో కూడా చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది అంటున్నారు.

ఎగ్జిట్ పోల్స్ కు కాని, సర్వేలకు గానీ ఎన్నికల కమిషన్ అంగీకరించకపోవడంతో ఫలితాలపై కచ్చితమైన సమాచారం రావటం లేదు గాని రెండో దశ పోలింగ్ లోనూ అధికార భారతీయ జనతా పార్టీకి చుక్కెదురైంది అంటున్నారు.

తొలి దశ జరిగిన 91 నియోజకవర్గాలలో 5 స్థానాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో…. రెండో దశలో కూడా అదే స్థాయిలో ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

రెండో దశ పోలింగ్ జరిగిన రాష్ట్రాలలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అంత బలంగా లేదు. ఈ రెండు రాష్ట్రాలలో కూడా రెండో దశ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అనుకూలించే అంశాలు ఏవీ కనిపించడం లేదంటున్నారు.

రెండో దశ పోలింగ్ జరిగిన రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి అనుకూలించే రాష్ట్రాలు పెద్దగా లేవు. గతంలో తాము ఓటమి పాలైన నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలలోనే తొలి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించేలా భారతీయ జనతా పార్టీ దానితగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుందని అంటున్నారు.

ఈ రెండు దశలలోను ఎన్నికల సరళిని అంచనా వేసుకున్న అనంతరం మిగిలిన దశల్లో వ్యూహ ప్రతివ్యూహాలను రచించే దిశగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందంటున్నారు. తొలి రెండు దశల్లోనూ 180 నియోజకవర్గాల్లో పోలింగ్ పరిసమాప్తం అయింది. మిగిలిన దశలలో 350 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

తొలి రెండు దశల్లోనూ కేవలం పది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తామని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ మిగిలిన స్థానాలలో 90 శాతానికి పైగా విజయం సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది.

అయితే పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవని, చివరి దశల్లో జరిగే పోలింగ్ లో సగం స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం మాత్రం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News