రజనీకాంత్ కోసం విలన్ గా మారిన ఎస్.జె.సూర్య

తమిళ డైరెక్టర్ ఎస్.జె.సూర్య కేవలం దర్శకుడిగా మాత్రమే కాక ఒక నటుడిగా కూడా ప్రేక్షకులకు సుపరిచితుడే. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’, మహేష్ బాబు ‘నాని’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఎస్.జె.సూర్య ఈ చిత్రాలలో కామియో పాత్రలో కనిపించాడు. తెలుగు లో ఆఖరిసారిగా పవన్ కళ్యాణ్ ‘పులి’ సినిమాకు దర్శకత్వం వహించిన సూర్య ఈ మధ్యనే మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా లో విలన్ గా అవతారం ఎత్తారు. విజయ్ ‘మెర్సల్’ సినిమాలో కూడా విలన్ పాత్ర పోషించిన […]

Advertisement
Update: 2019-04-09 03:00 GMT

తమిళ డైరెక్టర్ ఎస్.జె.సూర్య కేవలం దర్శకుడిగా మాత్రమే కాక ఒక నటుడిగా కూడా ప్రేక్షకులకు సుపరిచితుడే. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’, మహేష్ బాబు ‘నాని’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఎస్.జె.సూర్య ఈ చిత్రాలలో కామియో పాత్రలో కనిపించాడు.

తెలుగు లో ఆఖరిసారిగా పవన్ కళ్యాణ్ ‘పులి’ సినిమాకు దర్శకత్వం వహించిన సూర్య ఈ మధ్యనే మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా లో విలన్ గా అవతారం ఎత్తారు. విజయ్ ‘మెర్సల్’ సినిమాలో కూడా విలన్ పాత్ర పోషించిన ఎస్.జె సూర్య కి ఇప్పుడు ఏకంగా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం దొరికింది.

తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు ఎస్.జె సూర్య. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురి పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని ‘తలైవర్ 166’ అని పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలోనే కాక మరి కొన్ని సినిమాలలో కూడా ఎస్.జె.సూర్య విలన్ అవతారాల్లో కనిపించనున్నారు అని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News