బంగార్రాజులో నయనతార

హీరో నాగార్జున ఒకేసారి రెండు ప్రాజెక్టులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటి మన్మధుడు-2 కాగా, రెండోది బంగార్రాజు ప్రాజెక్టు. మన్మధుడు-2 ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసింది. ఇప్పుడు బంగార్రాజు కూడా ఓ కొలిక్కి వస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. రచయిత సత్యానంద్ తో కలిసి దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ సినిమాకు తుది రూపు తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి సంప్రదింపులు […]

Advertisement
Update: 2019-04-05 05:25 GMT

హీరో నాగార్జున ఒకేసారి రెండు ప్రాజెక్టులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటి మన్మధుడు-2 కాగా, రెండోది బంగార్రాజు ప్రాజెక్టు. మన్మధుడు-2 ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసింది. ఇప్పుడు బంగార్రాజు కూడా ఓ కొలిక్కి వస్తోంది.

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. రచయిత సత్యానంద్ తో కలిసి దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ సినిమాకు తుది రూపు తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

నయనతార, నాగార్జున కాంబినేషన్ కొత్త కాదు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో గ్రీకువీరుడు అనే సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి బంగార్రాజు ప్రాజెక్టుతో కలవబోతోందన్నమాట ఈ జంట. హిట్ అయిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా ఇది వస్తోంది. ఇందులో నాగచైతన్య కూడా నటించబోతున్నాడనే విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News