కారు అధిష్టానంతో పవన్ మంతనాలు ?

అనుమానంగా ఉందా..? ఇలా జరిగే అవకాశం లేదనుకుంటున్నారా? రాజకీయాలలో ఎప్పుడైనా, ఏదైనా జరుగుతుందని అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి.  మిత్రులు శత్రువులుగాను…. శత్రువులు మిత్రులుగాను మారిపోయారు అనడానికి అనేకానేక ఉదంతాలు ఉన్నాయి. అలాగే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానంతో రహస్య చర్చలు జరిపారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తోంది. ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ చేస్తున్న […]

Advertisement
Update: 2019-04-04 23:21 GMT

అనుమానంగా ఉందా..? ఇలా జరిగే అవకాశం లేదనుకుంటున్నారా? రాజకీయాలలో ఎప్పుడైనా, ఏదైనా జరుగుతుందని అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. మిత్రులు శత్రువులుగాను…. శత్రువులు మిత్రులుగాను మారిపోయారు అనడానికి అనేకానేక ఉదంతాలు ఉన్నాయి.

అలాగే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానంతో రహస్య చర్చలు జరిపారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తోంది. ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేతలను పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వేలు పెట్టవద్దు అంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులతో చర్చలు జరిపాడన్నా…. రాజకీయ వర్గాలు విశ్వసించడం లేదు. అయితే పవన్ కల్యాణ్ జరిపిన చర్చలు వెనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే జాతీయ రాజకీయాలే ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెబుతున్నారు.

హైదరాబాదులో గురువారం జరిగిన జనసేన బహిరంగ సభలో బిఎస్పీ నాయకురాలు మాయావతి పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఇద్దరు సీనియర్ నాయకులను తమ దూతలుగా పంపిందని సమాచారం.

ఈ సందర్భంగా మాయావతితో చర్చించిన టీఆర్ఎస్ దూతలు పవన్ కల్యాణ్ తో కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలపై చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తమకు సర్వేల ద్వారా తెలుస్తోందని, అక్కడి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ను నిందిస్తూ మాట్లాడడం తగదని పవన్ కు హితవు పలికినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అక్కడ ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ తిరిగి ఇక్కడికే రావాలని…. అక్కడ ఎన్నికలకు, కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమనేది కేసీఆర్ వ్యవహారంగానే చూడాలని, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ దూతలు పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News