కాంగ్రెస్ మ్యానిఫెస్టో.... రైతులు అప్పులు కట్టకపోయినా జైలుకు వెళ్లరు

కాంగ్రెస్ పార్టీ ఇప్పటకే ‘న్యాయ్’ పేరిట పేదవారికి కనీసం ప్రతీనెల 6 వేల రూపాయలు బ్యాంకు అకౌంట్లో వేస్తామని ప్రకటించింది. దీనికి తోడుగా ఇవాళ వెలువరించిన పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు వెలువరించింది. ఇకపై రైతులు బ్యాంకుల్లో చేసే అప్పలు చెల్లించక పోయినా వారిపై కేసులు ఉండవని… ఆ చెక్ బౌన్స్ కేసుల్లో వాళ్లు జైలుకు వెళ్లరని…. వాటిని రద్దు చేయనున్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తమ […]

Advertisement
Update: 2019-04-02 07:09 GMT

కాంగ్రెస్ పార్టీ ఇప్పటకే ‘న్యాయ్’ పేరిట పేదవారికి కనీసం ప్రతీనెల 6 వేల రూపాయలు బ్యాంకు అకౌంట్లో వేస్తామని ప్రకటించింది. దీనికి తోడుగా ఇవాళ వెలువరించిన పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు వెలువరించింది.

ఇకపై రైతులు బ్యాంకుల్లో చేసే అప్పలు చెల్లించక పోయినా వారిపై కేసులు ఉండవని… ఆ చెక్ బౌన్స్ కేసుల్లో వాళ్లు జైలుకు వెళ్లరని…. వాటిని రద్దు చేయనున్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.

ఇవాళ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫేస్టోను ప్రకటించింది. రాబోయే మార్చిలోపు కొత్తగా 22 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా ఇప్పటికంటే మరో 100 రోజులు అదనంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పొడిగిస్తామని ప్రకటించారు. న్యాయ్ పేరిట మొదలు పెట్టే పథకం ద్వారా పేదలకు ఏడాదికి 72 వేలు ఇస్తామని రాహుల్ మరోసారి చెప్పారు.

దేశం బాగుపడాలంటే మోడీ ప్రభుత్వం పోవాలని.. ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News