మోడీపై విపక్షాల ధ్వజం

ఒకవైపు భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, భారత పైలట్‌ పాకిస్థాన్ సైనికులకు చిక్కి చిత్ర హింసలు అనుభవిస్తున్న తరుణంలో దేశంలో విపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశం అయ్యాయి. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్‌, ఇతర నేతలు… మోడీపై ధ్వజమెత్తారు. పుల్వామా దాడిని మోడీ రాజకీయం కోసం వాడుకుంటున్నారని విపక్ష నేతలు విమర్శించారు. పుల్వామా దాడిని ఖండిస్తున్నామంటూనే రాహుల్‌ గాంధీ… మోడీపై విమర్శలు చేశారు. అఖిలపక్ష భేటీలో కూడా ప్రధాని సరిగా వ్యవహరించలేదన్నారు విపక్ష […]

Advertisement
Update: 2019-02-27 06:53 GMT

ఒకవైపు భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, భారత పైలట్‌ పాకిస్థాన్ సైనికులకు చిక్కి చిత్ర హింసలు అనుభవిస్తున్న తరుణంలో దేశంలో విపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశం అయ్యాయి. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్‌, ఇతర నేతలు… మోడీపై ధ్వజమెత్తారు.

పుల్వామా దాడిని మోడీ రాజకీయం కోసం వాడుకుంటున్నారని విపక్ష నేతలు విమర్శించారు. పుల్వామా దాడిని ఖండిస్తున్నామంటూనే రాహుల్‌ గాంధీ… మోడీపై విమర్శలు చేశారు. అఖిలపక్ష భేటీలో కూడా ప్రధాని సరిగా వ్యవహరించలేదన్నారు విపక్ష నేతలు. భద్రతా దళాల త్యాగాలను మోడీ రాజకీయం కోసం వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని నేతలు చెప్పారు.

సంకుచిత రాజకీయాల కోసం దేశ భద్రతను పణంగా పెట్టకూడదన్నారు. విపక్షాల భేటీకి చంద్రబాబు, మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ప్రధానిపై తమకు విశ్వాసం లేదని విపక్ష నేతలు చెప్పడం విశేషం. 21 పార్టీల తరపున రాహుల్ గాంధీ మీడియా మందు ప్రకటన చదివి వినిపించారు.

Tags:    
Advertisement

Similar News