పెళ్లి చేసుకుంటే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలా?

“షాపింగ్ మాల్” సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ హీరోయిన్ గా వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది తెలుగు భామ అంజలి. తమిళ్ లో హీరోయిన్ గా ఒక గుర్తింపు వచ్చాకే తెలుగు సినిమాల్లో నటించింది ఈ భామ. ఇక ప్రస్తుతం ఈ భామకి అటు తమిళ్ లో గాని ఇటు తెలుగు లో గాని పెద్దగా అవకాశాలు లేవు. ప్రస్తుతం అంజలి చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. అయితే ఇలాంటి […]

Advertisement
Update: 2019-02-25 04:47 GMT

“షాపింగ్ మాల్” సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ హీరోయిన్ గా వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది తెలుగు భామ అంజలి. తమిళ్ లో హీరోయిన్ గా ఒక గుర్తింపు వచ్చాకే తెలుగు సినిమాల్లో నటించింది ఈ భామ.

ఇక ప్రస్తుతం ఈ భామకి అటు తమిళ్ లో గాని ఇటు తెలుగు లో గాని పెద్దగా అవకాశాలు లేవు. ప్రస్తుతం అంజలి చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. అయితే ఇలాంటి టైం లోనే అంజలి పెళ్లి చేసుకోబోతుందని… జై తో బ్రేక్ అప్ తరువాత అంజలి ఒక బిజినెస్ మెన్ తో ప్రేమలో పడిందని….. త్వరలో అతన్నే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోబోతుందనే రూమర్స్ వచ్చాయి.

ఇక ఈ రూమర్స్ పై అంజలి చాలా ఘాటుగా స్పందించింది. ఆమె ఈ విషయం పై స్పందిస్తూ “అంటే హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలా ? నేను ఎవరితో ప్రేమలో లేను…. నేను అసలు పెళ్లి కూడా చేసుకోను, ఒకవేళ పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలు వదిలే ప్రసక్తే లేదు” అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.

Tags:    
Advertisement

Similar News