సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది.... మాకు విభేదాల్లేవు " హరీష్ రావు

సీఎం కేసీఆర్‌తో తనకు విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని.. అందుకే నాకు మంత్రి పదవి దక్కలేదని అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇవాళ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్ కు వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాంతాలు, సామాజిక వర్గాల సమతుల్యం పాటిస్తూ కేసీఆర్ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారని.. అంతే కాని తనపై కోపం ఉండి తనను దూరం పెట్టారనడం నిజం […]

Advertisement
Update: 2019-02-19 01:22 GMT

సీఎం కేసీఆర్‌తో తనకు విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని.. అందుకే నాకు మంత్రి పదవి దక్కలేదని అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇవాళ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్ కు వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రాంతాలు, సామాజిక వర్గాల సమతుల్యం పాటిస్తూ కేసీఆర్ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారని.. అంతే కాని తనపై కోపం ఉండి తనను దూరం పెట్టారనడం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. మేమంతా కలిసే ఉన్నామని…. పార్టీలో కేసీఆర్ మాటే అందరం పాటిస్తామని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో నేను క్రమశిక్షణ గల కార్యకర్తను… నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. కేసీఆర్ నా సేవలను ఎలా ఉపయోగించుకోవాలని అనుకుంటే నేను అలా వారి ఆదేశాలను పాటిస్తానని అన్నారు. తనకు సోషల్ మీడియా, యూట్యూబ్‌ లో ఎలాంటి అకౌంట్లు లేవు…. అలా ఉన్నట్లు క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి, సీఎం కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా ఉండాలని ఆయన కోరారు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News