మరో వివాదంలో శశీథరూర్....

కేంద్ర మాజీ మంత్రి శశీ థరూర్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశాన్ని ‘హిందీ, హిందూ, హిందుత్వ’ అనేవే విడగొడుతున్నాయని.. మనకు కావలసింది ఏక సారుప్యత కాదని ఐక్యమత్యమని ఒక ట్వీట్ చేశారు. గతంలో కూడా పలు సందర్భాల్లో తన ట్వీట్ల ద్వారా వివాదాలు సృష్టించిన థరూర్.. తాజా ట్వీట్‌తో మరింత దూమారం రేపారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైంది. అయితే ఈ ట్వీట్ వెనక ఉన్న కథనం ఏంటంటే.. […]

Advertisement
Update: 2019-01-31 09:35 GMT

కేంద్ర మాజీ మంత్రి శశీ థరూర్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశాన్ని ‘హిందీ, హిందూ, హిందుత్వ’ అనేవే విడగొడుతున్నాయని.. మనకు కావలసింది ఏక సారుప్యత కాదని ఐక్యమత్యమని ఒక ట్వీట్ చేశారు.

గతంలో కూడా పలు సందర్భాల్లో తన ట్వీట్ల ద్వారా వివాదాలు సృష్టించిన థరూర్.. తాజా ట్వీట్‌తో మరింత దూమారం రేపారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైంది. అయితే ఈ ట్వీట్ వెనక ఉన్న కథనం ఏంటంటే..

ఇటీవల ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అమెరికా వెళ్లడానికి ఒక పీహెచ్‌డీ విద్యార్థి వచ్చాడు. అతడి ధృవపత్రాలు పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు విద్యార్థి హిందీ మాట్లాడకపోవడంతో ఆగ్రహంతో నీకు క్లియరెన్స్ ఇచ్చేది లేదు. తమిళనాడు వెళ్లిపో అని అన్నాడు.

ఇదే విషయాన్ని సదరు విద్యార్థి పోలీసులకు పిర్యాదు చేయడమే కాకుండా.. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

ఆ ఘటనను గుర్తు చేస్తూ శశీథరూర్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News