పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం... విప్ జారీ చేసిన కాంగ్రెస్

కీలకమైన 2019 లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న పార్లమెంట్ చివరి సమావేశాలు కొద్ది సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఇరు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. ఇక మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సభలో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి అనారోగ్య కారణాల రిత్యా అమెరికాలో చికిత్స తీసుకుంటుండటంతో బడ్జెట్ బాధ్యతను పీయుష్ గోయల్‌కు అప్పగించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ […]

Advertisement
Update: 2019-01-31 00:28 GMT

కీలకమైన 2019 లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న పార్లమెంట్ చివరి సమావేశాలు కొద్ది సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఇరు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది.

ఇక మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సభలో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి అనారోగ్య కారణాల రిత్యా అమెరికాలో చికిత్స తీసుకుంటుండటంతో బడ్జెట్ బాధ్యతను పీయుష్ గోయల్‌కు అప్పగించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. ఇవాళ, రేపు జరిగే సమావేశాలకు తప్పక హాజరై పార్టీ నిర్ణయాలకు మద్దతు తెలపాలని ఆదేశించింది. బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది.

Tags:    
Advertisement

Similar News