జార్జి ఫెర్నాండెజ్ మృతి

కేంద్ర మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) ఇవాళ ఉదయం కన్నుమూశారు. 1930 జూన్ 3న జార్జ్ కర్నాటకలోని మంగళూరులో జన్మించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పలు కార్మిక సంఘాలకు నాయకుడిగా కీలకంగా పని చేసిన ఆయన తొలుత జనతాదళ్ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. 1994లో సమతాపార్టీని స్థాపించారు. 2009 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ ఆ […]

Advertisement
Update: 2019-01-28 23:30 GMT

కేంద్ర మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) ఇవాళ ఉదయం కన్నుమూశారు. 1930 జూన్ 3న జార్జ్ కర్నాటకలోని మంగళూరులో జన్మించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

పలు కార్మిక సంఘాలకు నాయకుడిగా కీలకంగా పని చేసిన ఆయన తొలుత జనతాదళ్ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. 1994లో సమతాపార్టీని స్థాపించారు. 2009 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడిన యోధుడు జార్జ్, ఎమర్జెన్సీ కాలంలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన రైల్వే సమ్మె చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన మృతి రాజకీయాలకు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News