రెండో రోజు డీలా పడిన మజ్ను

 నెగెటివ్ టాక్ ఈఫెక్ట్ మజ్నుపై బాగానే పడింది. రెండో రోజు మిస్టర్ మజ్ను సినిమా చతికిలపడింది. తొలి రోజు 3 కోట్ల 20 లక్షల రూపాయల డీసెంట్ షేర్ రాబట్టిన మిస్టర్ మజ్ను సినిమా.. 2 రోజుల్లో తన షేర్ వాల్యూను కేవలం 5 కోట్ల 80లక్షల రూపాయలకు మాత్రమే పెంచుకోగలిగింది. సెకెండాఫ్ అస్సలు బాగాలేదనే ఫీడ్ బ్యాక్ తో వీకెండ్ అయినప్పటికీ శనివారం రోజు ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అటు ఓవర్సీస్ లో […]

Advertisement
Update: 2019-01-27 05:31 GMT

నెగెటివ్ టాక్ ఈఫెక్ట్ మజ్నుపై బాగానే పడింది. రెండో రోజు మిస్టర్ మజ్ను సినిమా చతికిలపడింది. తొలి రోజు 3 కోట్ల 20 లక్షల రూపాయల డీసెంట్ షేర్ రాబట్టిన మిస్టర్ మజ్ను సినిమా.. 2 రోజుల్లో తన షేర్ వాల్యూను కేవలం 5 కోట్ల 80లక్షల రూపాయలకు మాత్రమే పెంచుకోగలిగింది.

సెకెండాఫ్ అస్సలు బాగాలేదనే ఫీడ్ బ్యాక్ తో వీకెండ్ అయినప్పటికీ శనివారం రోజు ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా చతికిలపడింది. ఇక్కడ కనీసం సినిమా యావరేజ్ అంటున్నారు, అక్కడైతే ఏకంగా ఫ్లాప్ అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 18 కోట్ల రూపాయలకు అమ్మారట. అదే కనుక నిజమైతే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసంభవం. మరోవైపు శాటిలైట్ రూపంలో ఈ సినిమాకు 5 కోట్ల రూపాయలు రావడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం.

Tags:    
Advertisement

Similar News