వైసీపీలో చేరుతున్నాం... పురందేశ్వరి రాజకీయాలను విరమించుకుంటారు

తాను, తన కుమారుడు వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. జగన్‌తో కలిసి పనిచేసేందుకు తన కుమారుడు హితేష్ సిద్దంగా ఉన్నారన్నారు. తాము వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వైఎస్‌ జగన్‌ను లోటస్‌ పాండ్‌లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. పురందేశ్వరి పార్టీ మారే అవకాశం లేదని… కావాలంటే ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటారని వెంకటేశ్వరరావు చెప్పారు. ఇన్నేళ్లపాటు వైఎస్‌ జగన్‌ పోరాటం చేస్తూ పార్టీ నడపడం చాలా గొప్పవిషయమన్నారు. […]

Advertisement
Update: 2019-01-27 04:07 GMT

తాను, తన కుమారుడు వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. జగన్‌తో కలిసి పనిచేసేందుకు తన కుమారుడు హితేష్ సిద్దంగా ఉన్నారన్నారు. తాము వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

వైఎస్‌ జగన్‌ను లోటస్‌ పాండ్‌లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. పురందేశ్వరి పార్టీ మారే అవకాశం లేదని… కావాలంటే ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటారని వెంకటేశ్వరరావు చెప్పారు.

ఇన్నేళ్లపాటు వైఎస్‌ జగన్‌ పోరాటం చేస్తూ పార్టీ నడపడం చాలా గొప్పవిషయమన్నారు. ఆయన శ్రమకు ఫలితం దక్కాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఏపీలో పాలన గాడి తప్పిన మాట వాస్తవమన్నారు. అధికారులంతా చంద్రబాబు మీటింగ్‌ల కోసం పనిచేయాల్సి వస్తోందన్నారు.

ఇప్పటి వరకు రుణమాఫీ చేయకుండా మోసం చేసిన ప్రభుత్వం… ఇప్పుడు తిరిగి భవిష్యత్తు తేదీలతో చెక్‌లు ఇవ్వడం మరోసారి మోసం చేయడమేనన్నారు. పర్చూరు నుంచి తాము పోటీ చేయాలా లేక మరొకరు పోటీ చేయాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు.

Advertisement

Similar News