యువతి జీవితంతో విడతలవారీగా శ్రీకాంత్ ఆటలు...

కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో ఒక యువతి న్యాయం కోసం నిరసనకు దిగింది. తన జీవితంతో పదేపదే ఆడుకుంటున్న యువకుడికి వ్యతిరేకంగా మహిళా సంఘాలతో కలిసి అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. కట్టిన తాళికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. కోరుట్లకు చెందిన శ్రీకాంత్ ప్రేమ పేరుతో ఐదేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన రవళి వెంట పడ్డాడు. చివరకు అతడిని ఆమె నమ్మింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సర్వం అర్పించింది. కానీ మోజు తీరాక ఆమెను దూరం పెట్టాడు. […]

Advertisement
Update: 2019-01-25 23:18 GMT

కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో ఒక యువతి న్యాయం కోసం నిరసనకు దిగింది. తన జీవితంతో పదేపదే ఆడుకుంటున్న యువకుడికి వ్యతిరేకంగా మహిళా సంఘాలతో కలిసి అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. కట్టిన తాళికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది.

కోరుట్లకు చెందిన శ్రీకాంత్ ప్రేమ పేరుతో ఐదేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన రవళి వెంట పడ్డాడు. చివరకు అతడిని ఆమె నమ్మింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సర్వం అర్పించింది. కానీ మోజు తీరాక ఆమెను దూరం పెట్టాడు. పెళ్లి చేసుకోనంటూ మోసం చేశాడు.

అన్యాయాన్ని దిగమింగుకుని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుందుకు రవళి సిద్దమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ మళ్లీ సీన్‌లోకి ఎంటరయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ పెళ్లి కొడుకును బెదిరించాడు. పెళ్లి ఆగిపోయేలా చేశాడు. రవళి నిలదీయగా తానే పెళ్లి చేసుకుంటానంటూ ఎవరూ లేని సమయంలో తాళి కట్టాడు.

ఆ తర్వాత మళ్లీ ముఖం చాటేశాడు. రవళితో తనకెలాంటి సంబంధం లేదని మొండికేశాడు. దీంతో రవళి నేరుగా వెళ్లి శ్రీకాంత్ ఇంటి ముందే ధర్నాకు దిగింది. కట్టిన తాళికి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం మోసకారి మొగుడు పరారీలో ఉన్నాడు.

Tags:    
Advertisement

Similar News