బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలపై.... తేల్చేసిన సీఈసీ

లోక్‌సభ ఎన్నికలను తిరిగి బ్యాలెట్‌ పేపర్ల ద్వారా  నిర్వహించాలన్న డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్ అరోరా తేల్చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలను ఆయన ఖండించారు. ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యే అవకాశమే ఉంటే 2014 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో ఫలితాలు ఒకే పార్టీకి అనుకూలంగా ఉండాలి కదా అని ప్రశ్నించారు. 2014 తర్వాత జరిగిన […]

Advertisement
Update: 2019-01-24 01:00 GMT

లోక్‌సభ ఎన్నికలను తిరిగి బ్యాలెట్‌ పేపర్ల ద్వారా నిర్వహించాలన్న డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్ అరోరా తేల్చేశారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలను ఆయన ఖండించారు. ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యే అవకాశమే ఉంటే 2014 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో ఫలితాలు ఒకే పార్టీకి అనుకూలంగా ఉండాలి కదా అని ప్రశ్నించారు.

2014 తర్వాత జరిగిన ఎన్నికల్లో వేరువేరు పార్టీలు విజయం సాధించాయని గుర్తు చేశారు. ఢిల్లీలో ఆప్‌ క్లీన్ స్వీప్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించే కాలంలో అనేక ఇబ్బందులు ఉండేవన్నారు.

రిగ్గింగ్, బ్యాక్స్‌లు ఎత్తుకెళ్లడం, కౌంటింగ్‌లో విపరీతమైన జాప్యం వంటి సమస్యలు ఉండేవన్నారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్‌లు లేకుండా పోయాయన్నారు. దేశంలో వాడుతున్న ఈవీఎంలు అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడుకున్నవని సునీల్ అరోరా వివరించారు. కాబట్టి బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనడంలో అర్థం లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News