టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ జనవరి 15 సెంటిమెంట్

సంక్రాంతి రోజున కొహ్లీ బ్యాటింగ్ కు దిగితే సెంచరీనే 2017 జనవరి 15 న పూణే వన్డేలో ఇంగ్లండ్ పై 122 పరుగులు 2018 జనవరి 15న సెంచూరియన్ టెస్టులో సౌతాఫ్రికా పై 153 పరుగులు 2019 జనవరి 15న అడిలైడ్ వన్డేలో ఆసీస్ పై 104 పరుగులు అంతర్జాతీయ క్రికెట్లో…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…తన సంక్రాంతి సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడు. గత మూడేళ్లుగా జనవరి 15న టీమిండియా ఆడిన వన్డే లేదా టెస్టుమ్యాచ్ ల్లో… మూడంకెల స్కోర్లు సాధించడాన్ని […]

Advertisement
Update: 2019-01-17 04:53 GMT
  • సంక్రాంతి రోజున కొహ్లీ బ్యాటింగ్ కు దిగితే సెంచరీనే
  • 2017 జనవరి 15 న పూణే వన్డేలో ఇంగ్లండ్ పై 122 పరుగులు
  • 2018 జనవరి 15న సెంచూరియన్ టెస్టులో సౌతాఫ్రికా పై 153 పరుగులు
  • 2019 జనవరి 15న అడిలైడ్ వన్డేలో ఆసీస్ పై 104 పరుగులు

అంతర్జాతీయ క్రికెట్లో…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…తన సంక్రాంతి సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడు. గత మూడేళ్లుగా జనవరి 15న టీమిండియా ఆడిన వన్డే లేదా టెస్టుమ్యాచ్ ల్లో… మూడంకెల స్కోర్లు సాధించడాన్ని విరాట్ కొహ్లీ ఓ అలవాటుగా మార్చుకొన్నాడు.

జనవరి 15న బ్యాట్ పట్టి… కొహ్లీ క్రీజులోకి దిగాడంటే చాలు.. సెంచరీ సాధించి తీరాల్సిందే అన్న సెంటిమెంట్ అభిమానుల్లో బలపడిపోయింది.

2017 జనవరి15 న ఇంగ్లండ్ తో పూణే వేదికగా ముగిసిన వన్డేలో విరాట్ కొహ్లీ 122 పరుగులతో సెంచరీ సాధించాడు. అంతేకాదు.. ఆ మరుసటి ఏడాది..సౌతాఫ్రికాతో సెంచూరియన్ పార్క్ వేదికగా ముగిసిన టెస్టు మ్యాచ్ లో సైతం కొహ్లీ… జనవరి 15నే సెంచరీ బాదాడు. సెంచూరియన్ టెస్టులో ఏకంగా153 పరుగులు సాధించాడు.

ఇక..ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత తీన్మార్ సిరీస్ లోని రెండో వన్డేలో సైతం కొహ్లీ సెంచరీ సాధించాడు. జనవరి 15న అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో కొహ్లీ 104 పరుగులతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

గత మూడేళ్లుగా…జనవరి 15న సెంచరీలు సాధిస్తూ వచ్చిన ఏకైక క్రికెటర్ విరాట్ కొహ్లీ మాత్రమే.

Tags:    
Advertisement

Similar News