జాతీయ రహదారిపై విమాన రన్‌వే

విమానాలు అత్యవసర పరిస్థితుల్లో దిగాల్సి వస్తే అందు కోసం జాతీయ రహదారులను వాడుకోబోతున్నారు. విమానం ఎయిర్‌పోర్టులో కాకుండా అత్యవసరంగా దిగాల్సి వస్తే జాతీయ రహదారులపై దింపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ఆగడానికి వీలుగా జాతీయ రహదారులపై రన్‌వే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర జాతీయ రహదారులు, రవాణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా ఏపీలో నెల్లూరు-ఒంగోలు మధ్య జాతీయ రహదారిపై విమాన రన్‌వే ఏర్పాటు చేస్తామని వివరించింది. విజయవాడ- రాజమండ్రి మధ్య జాతీయ […]

Advertisement
Update: 2019-01-07 22:12 GMT

విమానాలు అత్యవసర పరిస్థితుల్లో దిగాల్సి వస్తే అందు కోసం జాతీయ రహదారులను వాడుకోబోతున్నారు. విమానం ఎయిర్‌పోర్టులో కాకుండా అత్యవసరంగా దిగాల్సి వస్తే జాతీయ రహదారులపై దింపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ఆగడానికి వీలుగా జాతీయ రహదారులపై రన్‌వే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర జాతీయ రహదారులు, రవాణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా ఏపీలో నెల్లూరు-ఒంగోలు మధ్య జాతీయ రహదారిపై విమాన రన్‌వే ఏర్పాటు చేస్తామని వివరించింది.

విజయవాడ- రాజమండ్రి మధ్య జాతీయ రహదారిపై విమానాలు ఆగడానికి వీలుగా రన్‌వే నిర్మాణం మాత్రం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది. ఒంగోలు, చిలకలూరిపేట మధ్య కూడా జాతీయ రహదారిపై రన్‌వే నిర్మాణానికి ప్రతిపాదనలు అంగీకరించామని కేంద్రం వివరించింది.

Tags:    
Advertisement

Similar News