విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన కథ ఇదేనా ?

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా “ఇస్మార్ట్ శంక‌ర్‌”. ఇటీవలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథగా ఇది తెరకెక్కుతుంది అని అర్ధం అవుతుంది. అలాగే ఈ మాస్ సినిమాలో పూరి జగన్నాధ్ తనదైన మార్క్ లవ్ స్టొరీ ని కూడా రాసుకున్నాడట. అయితే ఈ “ఇస్మార్ట్ శంక‌ర్‌” కథనే విజయ్ […]

Advertisement
Update: 2019-01-05 20:01 GMT

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా “ఇస్మార్ట్ శంక‌ర్‌”. ఇటీవలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథగా ఇది తెరకెక్కుతుంది అని అర్ధం అవుతుంది.

అలాగే ఈ మాస్ సినిమాలో పూరి జగన్నాధ్ తనదైన మార్క్ లవ్ స్టొరీ ని కూడా రాసుకున్నాడట. అయితే ఈ “ఇస్మార్ట్ శంక‌ర్‌” కథనే విజయ్ దేవరకొండ కోసం రెడీ చేసాడట పూరి. కథ రెడీ చెయ్యగానే వెళ్లి విజయ్ కి కూడా చెప్పాడట. కానీ విజయ్ ప్రస్తుతానికి బిజీగా ఉండడంతో…. ఇదే కథని హీరో రామ్ తో తెరకెక్కిస్తున్నాడట పూరి.

మరి విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన ఈ కథ హిట్ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది తెలియాలి అంటే మే వరకు ఆగాల్సిందే. పూరి కనెక్ట్స్ పై ఛార్మి, పూరి జగన్నాధ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News