తన టాటూ సీక్రెట్ చెప్పేసిన అనసూయ

బుల్లితెర స్టార్ యాంకర్ అయిన అనసూయ అటు టీవి షోస్ తో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. అయితే ఇలాంటి బిజీ షెడ్యూల్ లో కూడా న్యూ ఇయర్ ని ప్రేక్షకుల మధ్యలో జరుపుకుంది అనసూయ. అయితే ఇక సోషల్ మీడియా వేదిక ద్వారా అనసూయ తన ఒంటి పై ఉన్న టాటూ సీక్రెట్ ని బయట పెట్టింది. అయితే ట్రెడిషనల్ లుక్ లో కనపడకపోవచ్చు కానీ, ఆమె ఏదైనా మోడ్రన్ డ్రెస్ […]

Advertisement
Update: 2019-01-03 00:03 GMT

బుల్లితెర స్టార్ యాంకర్ అయిన అనసూయ అటు టీవి షోస్ తో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. అయితే ఇలాంటి బిజీ షెడ్యూల్ లో కూడా న్యూ ఇయర్ ని ప్రేక్షకుల మధ్యలో జరుపుకుంది అనసూయ. అయితే ఇక సోషల్ మీడియా వేదిక ద్వారా అనసూయ తన ఒంటి పై ఉన్న టాటూ సీక్రెట్ ని బయట పెట్టింది.

అయితే ట్రెడిషనల్ లుక్ లో కనపడకపోవచ్చు కానీ, ఆమె ఏదైనా మోడ్రన్ డ్రెస్ వేస్తె ఆమె గుండెలపై ఉన్న టాటూ కనిపిస్తుంటుంది. ఆ టాటూ మనకు క్లారిటీ గా కొన్ని ఫోటోలలో కనిపించినా ఆ పేరు ఏంటి? దానికి అర్ధం ఏమిటి? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. నిన్న ఆస్క్ అనసూయ పేరుతో ట్విట్టర్ లో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది అనసూయ. అందులో భాగంగా ఓ అభిమాని మీ టాటూకు అర్థమేంటి అని అడిగితే. ‘దాని పేరు నిక్కు. నా భర్త ముద్దు పేరు’ అని చెప్పుకొచ్చింది ఈ హాట్ యాంకర్. ఇక అనసూయ ఆ టాటూ పై స్పష్టత ఇవ్వగానే అందరికి ఒక పెద్ద డౌట్ క్లియర్ అయిపోయినట్టు అయ్యింది.

Tags:    
Advertisement

Similar News