శబరిమల ఘటన హిందువులపై 'పట్టపగలే జరిగిన అత్యాచారం' : కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

శబరిమల అయ్యప్ప స్వామి గర్భగుడిలోనికి ఇద్దరు మహిళలు ప్రవేశించి అపచారానికి పాల్పడ్డారనే విషయంపై కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగానే పుండుపై కారంలా కేంద్ర మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శబరిమల ఘటన హిందువులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘పట్టపగలే చేసిన అత్యాచారం’ అని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హేగ్డే వ్యాఖ్యానించారు. ఒకవైపు కేరళ రాజధాని తిరువునంతపురంలో నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన […]

Advertisement
Update: 2019-01-03 00:11 GMT

శబరిమల అయ్యప్ప స్వామి గర్భగుడిలోనికి ఇద్దరు మహిళలు ప్రవేశించి అపచారానికి పాల్పడ్డారనే విషయంపై కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగానే పుండుపై కారంలా కేంద్ర మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శబరిమల ఘటన హిందువులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘పట్టపగలే చేసిన అత్యాచారం’ అని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హేగ్డే వ్యాఖ్యానించారు.

ఒకవైపు కేరళ రాజధాని తిరువునంతపురంలో నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు హింసకు ప్రయత్నించడంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోనికి దిగారు. టియర్ గ్యాస్, వాటర్ కానన్‌లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.

కేరళ ప్రభుత్వం, సీఎం విజయన్ పక్షపాతధోరణి వల్లే ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర మంత్రి అనంత్ అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును నేను గౌరవిస్తాను…. కాని రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉంచాల్సిన బాధ్యత, ప్రజల మనోభావాలు గాయపడకుండా వ్యవహరించవలసిన ముందు చూపు ప్రభుత్వానికి ఉండాలని ఆయన చెప్పారు.

శబరిమల విషయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడటంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఇది కచ్చితంగా హిందువులపై పట్టపగలు జరిగిన అత్యాచారమని ఆయన విచారం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News