జనవరి ఒకటిన రికార్డ్‌ బద్దలు కొట్టిన భారత్.... ఎంతమంది పుట్టారో తెలుసా!

కొత్త ఏడాది మొదటి రోజే భారత్‌ ఒక రికార్డును నెలకొల్పింది. ప్రపంచంలో జనవరి ఒకటిన అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన  దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచింది. చైనా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. యునెసెఫ్‌ ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి ఫస్ట్‌న భారత్‌లో 68వేల 933 మంది శిశువులు జన్మించారు. భారత్ తర్వాతి స్థానంలో చైనా ఉంది. చైనాలో జనవరి ఒకటిన 44 వేల 940 మంది పిల్లలు జన్మించారు. తర్వాతి స్థానంలో 25వేల […]

Advertisement
Update: 2019-01-01 21:54 GMT

కొత్త ఏడాది మొదటి రోజే భారత్‌ ఒక రికార్డును నెలకొల్పింది. ప్రపంచంలో జనవరి ఒకటిన అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచింది. చైనా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. యునెసెఫ్‌ ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి ఫస్ట్‌న భారత్‌లో 68వేల 933 మంది శిశువులు జన్మించారు.

భారత్ తర్వాతి స్థానంలో చైనా ఉంది. చైనాలో జనవరి ఒకటిన 44 వేల 940 మంది పిల్లలు జన్మించారు. తర్వాతి స్థానంలో 25వేల 685 మంది శిశువులకు జన్మనిచ్చిన దేశంగా నైజిరియా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం, వారి హక్కుల పరిరక్షణ కోసం యునెసెఫ్‌ పనిచేస్తోంది.

గణాంకాల విడుదల సందర్భంగా మాట్లాడిన యూనిసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెట్రీ … ప్రపంచవ్యాప్తంగా సరైన ఆహారం అందకపోవడం వల్ల సగటున రోజుకు పది లక్షల మంది పిల్లలు చనిపోతున్నారని వివరించారు. జనవరి ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా 3లక్షల 95వేల 72 మంది పిల్లలు పుట్టినట్టు అంచనా వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

జనవరి ఒకటిన పాకిస్తాన్‌లో 15వేల 112 మంది, బంగ్లాదేశ్‌లో 8,428 మంది పిల్లలు జన్మించారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి ఒకటిన పుట్టిన శిశువుల్లో భారత్‌కు చెందిన వారు 18 శాతంగా ఉన్నారని యూనిసెఫ్ ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News