కాల్చి పారేయాలని సీఎం ఆదేశాలు... వీడియో వైరల్

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆ మధ్య తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ఒక మహిళా రైతును… ”ఇంతకాలం ఎక్కడ పడుకున్నావ్” అంటూ ప్రశ్నించి తీవ్ర విమర్శల పాలైన కుమారస్వామి… తాజాగా ఆగ్రహంతో ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జేడీఎస్‌కు చెందిన జిల్లా స్థాయి నేత ప్రకాశ్‌ను కొందరు దుండగులు సోమవారం హత్య చేశారు. కారును వెంబడించి … దారి మధ్యలో ఆపి దాడి చేసి చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న […]

Advertisement
Update: 2018-12-24 21:41 GMT

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆ మధ్య తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ఒక మహిళా రైతును… ”ఇంతకాలం ఎక్కడ పడుకున్నావ్” అంటూ ప్రశ్నించి తీవ్ర విమర్శల పాలైన కుమారస్వామి… తాజాగా ఆగ్రహంతో ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

జేడీఎస్‌కు చెందిన జిల్లా స్థాయి నేత ప్రకాశ్‌ను కొందరు దుండగులు సోమవారం హత్య చేశారు. కారును వెంబడించి … దారి మధ్యలో ఆపి దాడి చేసి చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న కుమారస్వామి పోలీసుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులు కనిపిస్తే కాల్చిపారేయండి అంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారు.

ఈ వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. హంతకులపై ఏమాత్రం కనికరం లేకుండా కాల్చిపారేయాలని సీఎం ఆదేశించడంతో వివాదం మొదలైంది. హంతకులను అరెస్ట్ చేసి కోర్టు ద్వారా శిక్షించాల్సిందిపోయి నేరుగా కాల్చిపారేయండి అని ముఖ్యమంత్రి ఎలా ఆదేశాలు ఇస్తారంటూ కొందరు నిలదీశారు. దీంతో కుమారస్వామి వెంటనే స్పందించారు.

తమ పార్టీ నేత హత్యకు గురయ్యాడన్న బాధలో, ఆవేశంలో తాను అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తిగా ఆ క్షణంలో తాను స్పందించానని… ఒక ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేయలేదని వివరణ ఇచ్చారు.

ప్రకాశ్‌ను హత్య చేసినట్టు భావిస్తున్న హంతకులు ఇది వరకే రెండు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారని కుమారస్వామి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News