మొన్న హీరో.... ప్రస్తుతం విలన్.... ఇకపై నిర్మాత

అరవింద్ స్వామిని ఇప్పట్లో మరిచిపోలేరు ప్రేక్షకులు. సౌత్ సినిమాపై అతడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆలిండియా అందగాడిగా ఒకప్పుడు అమ్మాయిల మనసు కొల్లగొట్టాడు. ప్రస్తుతం మంచి నటుడిగా, విలన్ గా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఇప్పుడీ నటుడు త్వరలోనే మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. అవును.. త్వరలోనే నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తానంటున్నాడు అరవింద్ స్వామి. ఓ సొంత బ్యానర్ ఏర్పాటుచేసి దానిపై తమిళ, తెలుగు హీరోలతో సినిమాలు నిర్మిస్తానని ప్రకటించాడు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే తనకు […]

Advertisement
Update: 2018-12-25 09:00 GMT

అరవింద్ స్వామిని ఇప్పట్లో మరిచిపోలేరు ప్రేక్షకులు. సౌత్ సినిమాపై అతడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆలిండియా అందగాడిగా ఒకప్పుడు అమ్మాయిల మనసు కొల్లగొట్టాడు. ప్రస్తుతం మంచి నటుడిగా, విలన్ గా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఇప్పుడీ నటుడు త్వరలోనే మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

అవును.. త్వరలోనే నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తానంటున్నాడు అరవింద్ స్వామి. ఓ సొంత బ్యానర్ ఏర్పాటుచేసి దానిపై తమిళ, తెలుగు హీరోలతో సినిమాలు నిర్మిస్తానని ప్రకటించాడు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే తనకు లైఫ్ ఇచ్చిన మణిరత్నం డైరక్షన్ లో కూడా ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తానంటున్నాడు.

అరవింద స్వామికి రెస్టారెంట్స్ తో పాటు కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు ఉన్నాయి. ఇతర వ్యాపారాలు కూడా ఇంకొన్ని ఉన్నాయి. కాబట్టి ఇతడికి డబ్బు సమస్య లేదు. పైగా ఈ హీరోకు ఫైనాన్స్ చేయడానికి కూడా కోలీవుడ్ లో కొందరు సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్లూ నటనపై మాత్రమే దృష్టిపెట్టిన ఈ నటుడు, ఇకపై నిర్మాణ రంగంలో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News