నేను డబ్బుల కోసం అమెరికా రాలేదు " పవన్‌ కల్యాణ్

అధికారం చేతిలో ఉన్నప్పుడే మార్పు తేవడం సాధ్యమవుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తాను దేశానికి ఏం చేయగలను అన్న దానిపైనే ఆలోచన చేస్తుంటానని చెప్పారు. పోరాటాలు చేసే శక్తి తనకుందని వ్యాఖ్యానించారు. అందుకే దేశం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రానురాను అవినీతి పెరిగిపోయి రౌడీలు రాజ్యమేలే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఫండ్‌ కోసం పవన్ అమెరికా వెళ్లారన్న వార్తలను ఆయన ఖండించారు. తాను ఆత్మగౌరవంతో బతికే వ్యక్తినని… అలాంటి […]

Advertisement
Update: 2018-12-16 00:08 GMT

అధికారం చేతిలో ఉన్నప్పుడే మార్పు తేవడం సాధ్యమవుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తాను దేశానికి ఏం చేయగలను అన్న దానిపైనే ఆలోచన చేస్తుంటానని చెప్పారు.

పోరాటాలు చేసే శక్తి తనకుందని వ్యాఖ్యానించారు. అందుకే దేశం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రానురాను అవినీతి పెరిగిపోయి రౌడీలు రాజ్యమేలే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఫండ్‌ కోసం పవన్ అమెరికా వెళ్లారన్న వార్తలను ఆయన ఖండించారు.

తాను ఆత్మగౌరవంతో బతికే వ్యక్తినని… అలాంటి తాను డబ్బులు అడుగుతానని ఎలా అనుకున్నారని ప్రశ్నించారు. బయటి దేశానికి వచ్చి సొంత రాష్ట్రాన్ని కించపరచడం తనకిష్టముండదన్నారు. తాను ఒక రాష్ట్రం కోసం పోరాటం చేయడం లేదని… దేశం కోసం ఆలోచిస్తున్నానని చెప్పారు.

డల్లాస్‌లో జరిగిన జనసేన ప్రవాస గర్జనలో మాట్లాడిన పవన్ కల్యాణ్… నిజాయితీగా ఉండే వారినే చట్టం ఇబ్బంది పెడుతోందని వ్యాఖ్యానించారు. తప్పులు చేసిన వారు మాత్రం అధికారంలో కూర్చుంటున్నారని విమర్శించారు. రాజకీయాల నుంచి అవినీతిని తరిమేసే బాధ్యతను యువత తీసుకోవాలని సూచించారు.

ఎవరినో మారాలని చెప్పడం కాదు…. ముందు మనకు మనం మారాలని పిలుపునిచ్చారు పవన్‌. నీతి తప్పిన రాజకీయాల వల్లే ఇప్పటి వరకు వ్యవస్థలో మార్పు రాలేదన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే శక్తి ఎన్‌ఆర్‌ఐలకు ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Similar News