వనభోజనాలు కావాలంటే వ్యక్తిగతంగా చేసుకోండి.... నా పేరు మీద వద్దు....

కార్తీక వనభోజనాల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక సూచనలు చేశారు. వనభోజనాలు తన పేరు మీద గానీ, జనసేన పేరు మీద గాని నిర్వహించవద్దని సూచించారు. కావాలంటే వ్యక్తిగతంగా వనభోజనాలు చేసుకోండి కానీ… తన పేరు మీద చేయవద్దని పార్టీ నేతలకు పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ నాయకులందరికీ ఇదే తన విన్నపం అని ట్వీట్ చేశారు. ప్రజలకు కార్తీక మాసం శుభాకాంక్షలు చెప్పారు పవన్‌. జనసేన నాయకులందరికీ విన్నపం: కార్తీక […]

Advertisement
Update: 2018-11-11 23:23 GMT

కార్తీక వనభోజనాల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక సూచనలు చేశారు. వనభోజనాలు తన పేరు మీద గానీ, జనసేన పేరు మీద గాని నిర్వహించవద్దని సూచించారు.

కావాలంటే వ్యక్తిగతంగా వనభోజనాలు చేసుకోండి కానీ… తన పేరు మీద చేయవద్దని పార్టీ నేతలకు పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ నాయకులందరికీ ఇదే తన విన్నపం అని ట్వీట్ చేశారు. ప్రజలకు కార్తీక మాసం శుభాకాంక్షలు చెప్పారు పవన్‌.

మరోవైపు తిత్లీ తుపాను సహాయక చర్యలను పబ్లిసిటీకి చంద్రబాబు వాడుకుంటున్న తీరుపైనా పవన్‌ తీవ్రంగా స్పందించారు. తిత్లీ తుపాను బాధితులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొండంత అండ అంటూ ఆర్టీసీ బస్సులపై చంద్రబాబు పోస్టర్లు వేయించుకోవడాన్ని పవన్ తప్పుపట్టారు.

తుపాను సహాయక చర్యలను కూడా ప్రచారం చేసుకోవడం బట్టి పబ్లిసిటీ వ్యవహారం ఎవరెస్ట్‌ను తాకిందని ఎద్దేవా చేశారు పవన్‌.

Advertisement

Similar News