టీ-20 మహిళా ప్రపంచకప్ లో భారత్ సంచలనం

రెండోర్యాంకర్ న్యూజిలాండ్ కు ఐదోర్యాంకర్ భారత్ షాక్ న్యూజిలాండ్ పై 34 పరుగులతో భారత్ సంచలన విజయం కరీబియన్ ద్వీపాలు వేదికగా ప్రారంభమైన మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో 5వ ర్యాంకర్ భారత్ సంచలన విజయంతో టైటిల్ వేట మొదలుపెట్టింది. గయానా నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ తొలిమ్యాచ్ లో భారత్ 34 పరుగులతో రెండోర్యాంకర్ న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న […]

Advertisement
Update: 2018-11-10 04:55 GMT
  • రెండోర్యాంకర్ న్యూజిలాండ్ కు ఐదోర్యాంకర్ భారత్ షాక్
  • న్యూజిలాండ్ పై 34 పరుగులతో భారత్ సంచలన విజయం

కరీబియన్ ద్వీపాలు వేదికగా ప్రారంభమైన మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో 5వ ర్యాంకర్ భారత్ సంచలన విజయంతో టైటిల్ వేట మొదలుపెట్టింది.

గయానా నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ తొలిమ్యాచ్ లో భారత్ 34 పరుగులతో రెండోర్యాంకర్ న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.

ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్…20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్…51 బాల్స్ లో 7 బౌండ్రీలు, 8 సిక్సర్లతో సుడిగాలి సెంచరీ సాధించింది. యువప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 45 బాల్స్ లోనే 7 బౌండ్రీలతో 59 పరుగుల స్కోరు నమోదు చేసింది.

సమాధానంగా 195 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్…20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Tags:    
Advertisement

Similar News