టీ-20 ప్రపంచకప్ లో హర్మన్ ప్రీత్ సుడిగాలి సెంచరీ

49 బాల్స్ లోనే ధూమ్ ధామ్ శతకం 51 బాల్స్ లో 8 సిక్సర్లు, 7 బౌండ్రీలతో 103 పరుగులు టీ-20 మహిళా ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో శతకం సాధించిన భారత తొలిమహిళగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ గ్రూప్- బీ ప్రారంభలీగ్ పోటీలో…న్యూజిలాండ్ బౌలర్లను హర్మన్ ప్రీత్ ఓ ఆటాడుకొంది.  కేవలం 51 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 8 సిక్సర్లతో సుడిగాలి సెంచరీ […]

Advertisement
Update: 2018-11-10 05:45 GMT
  • 49 బాల్స్ లోనే ధూమ్ ధామ్ శతకం
  • 51 బాల్స్ లో 8 సిక్సర్లు, 7 బౌండ్రీలతో 103 పరుగులు

టీ-20 మహిళా ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో శతకం సాధించిన భారత తొలిమహిళగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది.

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ గ్రూప్- బీ ప్రారంభలీగ్ పోటీలో…న్యూజిలాండ్ బౌలర్లను హర్మన్ ప్రీత్ ఓ ఆటాడుకొంది.

కేవలం 51 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 8 సిక్సర్లతో సుడిగాలి సెంచరీ సాధించింది. హర్మన్ ప్రీత్ 103 పరుగుల స్కోరుకు అవుటయ్యింది. కేవలం 49 బాల్స్ లోనే వంద పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్.. మహిళా టీ-20 క్రికెట్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది.

జెమీమా రోడ్రిగేస్ తో కలసి నాలుగో వికెట్ కు 134 పరుగులు జోడించింది. అంతేకాదు..న్యూజిలాండ్ ప్రత్యర్థిగా భారత్ 194 పరుగులతో అత్యధిక స్కోరు సాధించడం మరో విశేషం.

వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో 171 పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్…ఇప్పుడు టీ-20 ప్రపంచకప్ లో సైతం శతకం బాదడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News