సుప్రీంకోర్టు ఎఫెక్ట్.... 2100 మందిపై కేసులు!

దీపావళి పండుగపై ఆంక్షలు విధిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ప్రజానీకంపై పడింది. ఆదేశాలు ధిక్కరించినందుకు గాను ఒక్క చెన్నైలోనే 2100 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరిలో పెద్ద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. దీంతో ఎవరైనా కోర్టు సూచనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పేశారు పోలీసులు.  దీపావళి పండుగ సందర్భంగా కేసులతో బెంబేలెత్తిస్తున్నారు తమిళనాడు పోలీసులు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం […]

Advertisement
Update: 2018-11-08 02:50 GMT

దీపావళి పండుగపై ఆంక్షలు విధిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ప్రజానీకంపై పడింది. ఆదేశాలు ధిక్కరించినందుకు గాను ఒక్క చెన్నైలోనే 2100 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరిలో పెద్ద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. దీంతో ఎవరైనా కోర్టు సూచనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పేశారు పోలీసులు.

దీపావళి పండుగ సందర్భంగా కేసులతో బెంబేలెత్తిస్తున్నారు తమిళనాడు పోలీసులు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు అందిన లెక్కల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2100 కేసులు నమోదయ్యాయి. 650 మందిని అరెస్ట్ కూడా చేశారు.

సుప్రీం ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు బాణాసంచా కాల్చాలని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు నిబంధలను బేఖాతరు చేసిన వారిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు.

చెన్నైలో అత్యధికంగా 344 మందిపై కేసులు నమోదు చేయగా…. కోయంబత్తూరులో 184 కేసులు, విల్లిపురంలో 160 కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 291, 188, 268 కింద ఈ కేసులు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News